సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించారు. కాసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చలు కొనసాగాయి. తాజాగా.. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లి నివేదితను ఖరారు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మా రెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Telangana Elections : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 8:15 గంటలకు బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Gaddar Daughter: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించాయి.
Off The Record: అనారోగ్యంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలం చేసినా.. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉపఎన్నిక వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది చివర్లో షెడ్యులు ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో సాంకేతికంగా కంటోన్మెంట్ కు ఉపఎన్నిక నిర్వహించే ఛాన్స్ లేదు. అయినప్పటికీ ఎస్సీ రిజర్డ్వ్ అయిన ఈ సీటుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. సాయన్న ఉండగానే అనేక మంది తమ స్థాయిలో లాబీయింగ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి.…
కరోనాను తరిమేసేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. సాధ్యమైనంత త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నాయి ప్రభుత్వాలు.. ఇందులో భాగంగా రెగ్యులర్‌గా ప్రభుత్వ ఆస్పత్రలు, పీహెచ్‌సీ సెంటర్లలో.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సాగుతున్నా.. మరింత విస్తృతంగా వ్యాక్సిన్ వేయాలన్న ఉద్దేశంతో.. జీహెచ్‌ఎంసీ కంటోన్మెంట్ ఏరియాలలో కోవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఈ నెల 23వ తేదీ నుండి 10-15 రోజుల పాటు ఈ స్పెషల్…