కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్ దగ్గర దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్‌తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా…
సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనకు టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉండచ్చని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుమానం వ్యక్తం చేసారు. నిన్నటి ఘటన పై మాట్లాడిన డికె అరుణ, నిన్న జరిగిన ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరుతామని డీకే అరుణ అన్నారు. శాంతియుత నిరసనకు వచ్చిన వారిని…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం సిటీ పోలీసులు విచారణ చేపట్టారు. ” చలో సికింద్రాబాద్ “అనే వాట్సప్ గ్రూపు సభ్యులను పోలీసులు గుర్తించారు. ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు చొరబడి నట్లు గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితమే వాట్స్అప్ గ్రూపులు క్రియేట్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హకీంపేట్ ఆర్మీ ర్యాలీ కి వచ్చినవారే విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు. ఆదిలాబాద్ నుంచి…
అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో .. రైల్వే పోలీస్ కాల్పుల్లో, వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం ఓ యువకుడి ప్రాణాలను బలిగొందని గ్రామస్తులు విమర్శించారు. కేంద్రం తప్పుడు విధానాలవల్లే రాకేష్ బలయ్యాడని మండిపడ్డారు. రాకేష్…
తాము ఏమైనా ఉగ్రవాదులమా.. కాల్పులు జరపడానికి అంటూ ఆందోళనకారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతారా అని మండిపడ్డారు. తమపై కాల్పులు జరపాలని ఎవరు ఆర్డర్ ఇచ్చారని ఆందోళనకారులు ప్రశ్నించారు. తమ నిరసనల్లో ఎలాంటి రాజకీయాలు లేవని, తమ న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ‘నాలుగు సంవత్సరాలుగా దీన్నే నమ్ముకొని ఉన్నాం. ఆందోళనల్లో రెండు బోగీలు తగలబడ్డాయంటున్నారు. మూడు…