నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని ఇప్పటి వరకు దాదాపు 30 గంటల పాటు ఈడీ విచారించింది. శుక్రవారమే విచారణకు రావాలని ఈడీ రాహుల్‌కు సమన్లు జారీ చేయగా.. మూడు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలో 17న కాకుండా 20న విచారణకు…
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్’పై నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వం సం చేశారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వయోపరిమితి సడలింపుతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు.…
కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్ దగ్గర దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్‌తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా…
సోనియాగాంధీ ఆదేశాలతో సత్యగ్రహ దీక్ష జరుగుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి వెల్లడించారు. అగ్నిపథ్‌పై పార్లమెంట్‌లో చర్చించకుండా యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ తీసుకొచ్చిన ప్రతి పథకం తన స్నేహితులు అదానీ, అంబానీల కోసమేనని ఆరోపణలు చేశారు. శ్రీలంకలో కూడా మోదీ అదానీకి సహకరించేలా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మాకు అగ్నిపథ్ వద్దని విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని ఆమె తెలిపారు. అగ్నిపథ్‌తో రక్షణ శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్…
పింఛన్లు, ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రక్షణ శాఖలో అగ్నిపథ్ తీసుకొచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నాలుగేళ్లకే రిటైర్ అవ్వడం అంటే పెళ్లికాగానే వితంతువు అయినట్లేనని ఆయన వర్ణించారు. నాలుగేళ్లలో 6నెలలు ట్రైనింగ్‌కే వెళ్తుందని.. ఆ 6 నెలల్లో ఏమి నేర్చుకుంటారని ప్రశ్నించారు. రక్షణ శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి సైనికులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆక్రోశం వల్లే యువకులు బులెట్లు తగిలినా వెనక్కి తగ్గలేదన్నారు. డిఫెన్స్ నిధులకు కోత…
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు చేయవదని ఆయన కార్యకర్తలకు పిలపునిచ్చారు. ఆదివారం 52వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాలో నిరసనలు తీవ్రం కావడంతో కోటాది మంది యువకులు వేదనకు గురవుతున్నారని.. ఇలాంటి వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన తమ పార్టీ కార్యకర్తలను, శ్రేయోభిలాషులను కోరారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై మేం ఆందోళన చెందుతున్నాం. కోటాది యువకులు వేదనకు గురవుతున్నారు. యువత, వారి కుటుంబాల…
రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అగ్నిపధ్” పధకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ “సత్యాగ్రహం” దీక్షకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దు కాంగ్రెస్ పార్టీ “సత్యాగ్రహం” దీక్ష ప్రారంభం కానున్న సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ “సత్యాగ్రహం” లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొననున్నారు. అయితే జంతర్ మంతర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా భారీ…
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్న విషయం తెలిసిందే. ఆర్మీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. యువత ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ.. ఇవాళ గాంధీ భవన్‌లో సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీక్ష వివరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. అగ్నిపథ్ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి…