Former TPCC President Uttam Kumar Reddy Fired on BJP and TRS Governments.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులను కేసీర్, మోడీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన.. తుగ్లక్ పాలన లెక్క ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రబీలో 52 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.. ఇప్పుడు 35 లక్షల వరకు సాగు చేశారన్నారు. ఆల్టర్నేట్ పంట లేకుండా చేశారని ఆయన ఆరోపించారు. మోడీ కేసీఆర్‌నీ.. కేసీఆర్ మోడీని అనుకుంటూ…రైతులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ చేత కానీ తనం తోనే రైతులు నష్టపోయారని, ఎరువుల ధరలు…ప్రతి ఏడాది పెరుగుతూ ఉన్నాయన్నారు. మూడేళ్ల క్రితం రైతులకు ఉచిత ఎరువులు ఇస్తా అని మోసం చేశారని, రుణమాఫీ ఇప్పటికీ చేయలేదన్నారు. నాలుగేండ్లు అయినా మాఫీ కాలేదని, నాలుగేళ్లు వడ్డీ భారంతో అప్పు రెండు లక్షలు అయ్యిందని ఆయన అన్నారు. రుణమాఫీ చేయనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, టీఆర్‌ఎస్ పాలనలో పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు.