bandi Sanjay speech at bjp vijaya sankalpa sabha.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల సీఎంలతో పాటు, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు సహా ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇంతమందిని చూస్తుంటే నాకు సంతోషంగా వుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతల విమర్శలు బాధ కలిగిస్తాయన్న బండి సంజయ్.. నరేంద్రమోడీ మీద తప్పుడు భాష ఉపయోగిస్తున్నారన్నారు. ఆయన్ని ఎందుకు తిట్టాలి. పేదలను ఆదుకున్నందుకు తిట్టాలా? ఆకలితో అలమటించకుండా ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా..? ఉక్రెయిన్ లో విద్యార్ధులు చిక్కకుంటే వారిని కాపాడినందుకా..? అని ఆయన ప్రశ్నించారు. మనం ఇంకా భరిద్దామా.. గడీ పాలన నుంచి తెలంగాణ తల్లి బంధ విముక్తిని చేయాలి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
భారతదేశం కాదు.. ఎక్కడికి వెళ్ళినా మోడీకి ఘనంగా స్వాగతిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ గొప్పతనం కేసీఆర్ కి తెలియదని, ఎంతోమంది బలిదానం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. తప్పకుండా అభివృద్ధి చేసుకుంటాం.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. ఒక పథకం ప్రకారం మోడీని తిడుతున్నారని, మోడీని విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మోడీ తెలంగాణ గురించి ఆలోచించారు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. పేద ప్రజలకోసం బీజేపీ పనిచేస్తోందన ఆయన వెల్లడించారు.
తెలంగాణ అప్పుల ఊబిలో ఉండిపోయిందని, తెలంగాణలో న్యాయం జరగాలంటే మోడీ పాలన రావాలన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా చెబుతున్నా.. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కేసీఆర్ గడీలను బద్దలుకొడతామని, స్వచ్ఛందంగా సభకు తరలివచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలని, ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించినందుకు రుణపడి ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు.