ప్రముఖ నృత్యకారిణి, పద్మ విభూషణ్ యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల కేంద్ర కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతపం తెలిపారు. భారతదేశంలో భరతనాట్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రఖ్యాతి గడించిన పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇకలేరనే వార్త విచారకరం అన్నారు.
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా యామినీ కృష్ణమూర్తి పేరు ప్రఖ్యాతలు గడించారు.