Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబెల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘స్పిరిట్’ . ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, పైగా ప్రభాస్ కాప్ రోల్లో కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. తాజాగా KJQ సినిమా టీమ్‌తో జరిపిన ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ షూటింగ్‌కి సంబంధించిన కీలక విశేషాలను పంచుకున్నారు. గత నాలుగు, ఐదు రోజుల క్రితం వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా ‘స్పిరిట్’ చిత్రీకరణలో నిరంతరాయంగా పాల్గొన్నానని సందీప్ వంగా తెలిపారు. ప్రస్తుతం షూటింగ్‌కి సంబంధించి ఒక నెల రోజుల పాటు తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ చిన్న విరామం తర్వాత మళ్లీ కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సినిమా పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని, ప్రేక్షకులు ఎంత ఎగ్జైట్మెంట్తో ఈ విజువల్ వండర్ కోసం ఎదురుచూస్తున్నారో, మేకర్స్‌గా తాము కూడా అంతే ఉత్సాహంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇండస్ట్రీకి చెందిన KJQ దర్శకుడు, దివంగత కిరణ్ జ్ఞాపకార్థం, ఆయనను ఎంతోగానూ అభిమానించే కామన్ ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులందరితో త్వరలోనే ఒక ప్రత్యేక సంస్మరణ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్లు ఈ వేదికగా వెల్లడించారు. మొత్తానికి ఈ చిన్న బ్రేక్ తర్వాత సందీప్ రెడ్డి వంగా అండ్ టీమ్ మరింత ఊపుతో ‘స్పిరిట్’ తదుపరి సుదీర్ఘ షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి సమాయత్తమవుతున్నారు.
Also Read
- Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
- Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
- Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
- Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
తాజావార్తలు
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!