Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఓపెనర్ యష్ ధుల్ అద్భుత శతకంతో చెలరేగాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో పురానీ ఢిల్లీ 6 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 23 ఏళ్ల ధుల్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇది అతనికి డీపీఎల్‌లో రెండో సెంచరీ. తన శతకంతో పాటు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన పురానీ ఢిల్లీ 6 నిర్ణీత 15 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ బౌలర్ మనీ గ్రేవాల్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి పురానీ ఢిల్లీ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ఒకానొక దశలో పురానీ ఢిల్లీ 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ అనుజ్ రావత్ (5), ఆర్యన్ గౌడ్ (2), దేవ్ లాక్రా (3), లలిత్ యాదవ్ (5) విఫలమయ్యారు. అయితే రోహన్ రాఠీ (21 బంతుల్లో 46), వికెట్ కీపర్ అశ్విని చిల్లా (29 బంతుల్లో 38) ఆరో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.
Also Read
141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ 13.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రారంభంలో సిద్ధార్థ్ జూన్ నిమ్మదించినా, ధుల్ నాలుగో ఓవర్లో రజనీష్ దాదర్ బౌలింగ్‌లో 23 పరుగులు, తదుపరి ఓవర్లో దిగ్వేష్ రాఠీ బౌలింగ్‌లో మరో 23 పరుగులు రాబట్టి గేర్ మార్చాడు. ధుల్ కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిద్ధార్థ్ (8) అవుట్ అయిన తర్వాత, యుగళ్ సైని (21 బంతుల్లో నాటౌట్ 27) తో కలిసి ధుల్ రెండో వికెట్‌కు విడదీయరాని 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దిగ్వేష్ రాఠీ వేసిన 14వ ఓవర్లో ధుల్ రన్ తీసి తన సెంచరీని, జట్టు విజయాన్ని ఒకేసారి ఖాయం చేశాడు. ఈ విజయంతో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!