ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూశారు. 63 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. రోహిత్ బాల్ మృతికి ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంతాపం తెలిపింది. పురుషులు, మహిళలకు ఆయన అందించిన డిజైన్లు బాగా ప్రసిద్ధి చెందాయి. 1986లో ఆర్చిడ్ ఓవర్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించి తన వృత్తిని ప్రారంభించారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని.. వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.
ప్రముఖ నృత్యకారిణి, పద్మ విభూషణ్ యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల కేంద్ర కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతపం తెలిపారు. భారతదేశంలో భరతనాట్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ప్రఖ్యాతి గడించిన పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇకలేరనే వార్త విచారకరం అన్నారు.
తైవాన్‌లో సంభవించిన భూకంపం మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. బుధవారం తైవాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణనష్టం జరగడం పట్ల మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.