కట్టుకున్న భర్త చనిపోతే లబోదిబోమంటూ ఏడిచే భార్యలను చూసే ఉంటారు. కానీ ఇక్కడ తమ భర్త చనిపోతే శవ పంచాయితీ పెట్టారు.. సదరు వ్యక్తికి చెందిన ఇద్దరు భార్యలు. ఈ ఘటన కోరుట్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అయిలాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (52) కోరుట్లలో స్థిరపడ్డాడు. అయితే సదరు వ్యక్తి నిన్న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిన్న మృతి చెందడంతో.. మధ్యాహ్నానికి కోరుట్లకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. అయితే.. మృతుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వారు భర్త మృతదేహాన్ని చూసేందుకు వచ్చి అస్తిపంపకాల విషయంలో గొడవ పెట్టుకున్నారు.
ఆస్తి పంపకం విషయంలో చిన్న భార్య కు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇద్దరితరపున పెద్దమనుషులు జోక్యం చేసుకోని.. పెద్ద మనుషుల ఇద్దరికి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. కథలాపూర్ మండలం తక్కల్లపల్లిలో ఉన్న వ్యవసాయ భూమిలో కొంత భాగం చిన్న భార్యకు రాసిచ్చేందుకు ఒప్పందం చేశారు. నేడు కథలాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయ్యేంతవరకు అంతక్రియలు నిలిపివేశారు. ఇద్దరు భార్యల మధ్య గొడవతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు ఇప్పటి వరకు వరకు నిర్వహించకపోవడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.