Hit and Run: గజ్వేల్‌లో హిట్ అండ్ రన్.. మృతులిద్దరు పోలీసులే..
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో హిట్ అండ్ రన్ ..
- మృతులిద్దరు పోలీసులుగా గుర్తింపు..
- మృతులది సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు, గాడిచర్లపల్లి గ్రామం..
- హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hit and Run: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులిద్దరు పోలీసులుగా గుర్తించారు. మృతులు సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు, గాడిచర్లపల్లి గ్రామంగా తెలిపారు. దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో వెంకటేష్, పరంధాములు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Read also: Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే నలుగురు మృతి!
Also Read
కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించడంతో నడిరోడ్డుపై మృతదేహాలు చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హైదరాబాద్ కు వెళ్లి వస్తామంటూ ఇద్దరు బయలుదేరి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారంటూ రోదించారు. వీరిని చూసిన స్థానికులు, పోలీసులు కంటతడిపెట్టారు. అయితే వీరిద్దరి వాహనాన్ని ఢీ కొట్టి వెళ్లిన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇద్దరు పోలీసుల మృతికి కారకులైన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. వారు ఎంతటి వారైనా వదిలే ప్రశక్తి లేదన్నారు.
మరోవైపు గజ్వేల్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్ల మృతిపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ ఉద్యోగంపై నిబద్ధత కలిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకి అండగా ఉంటానని.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Donald Trump: సిరియాలో ఉద్రిక్త పరిస్థితులు.. ట్రంప్ సంచలన ప్రకటన..
తాజావార్తలు
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్‌లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..