TS Police: నేటి నుంచి పోలీసు అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు.. 52వేల మంది హాజరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Police: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఈ రోజు (ఫిబ్రవరి 15) నుండి ఫిజికల్ ఈవెంట్‌లను నిర్వహించనుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోయినా, కోర్టు ఆదేశాలతో పలువురు ఎస్సీ, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థులకు నేటి నుంచి పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే.. ఈపరీక్షలో ఏకంగా 52 వేల మందికి పైగా అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరు ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి సిద్ధమయ్యారు. పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదట డిసెంబర్ 8 నుంచి 31 వరకు ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించారు. అవి కనిష్టంగా 9 రోజులు కాగా.. గరిష్టంగా 24 రోజులు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేటలో వీటిని నిర్వహించారు. ఇప్పటికే ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన దాదాపు 2.07 లక్షల మందిని అప్పట్లో ఈ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.
Read also: Kondagattu: బస్సు ప్రమాదం.. కండక్టర్ మృతి, 9 మందికి గాయాలు
Also Read
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ఇప్పుడు కొన్ని కేంద్రాలను తగ్గించారు. రాచకొండ, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట మినహా మిగిలిన 7 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేసింది. గత ఏడాది ఆగస్టులో 16,875 పోస్టుల కోసం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షకు దాదాపు 8.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు 60 మార్కులు సాధించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో 8 తప్పులు దొర్లాయి. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఫలితాలు విడుదల చేసి వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పట్లో 2.07 లక్షల మందిని అర్హులుగా గుర్తించి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి తుది రాత పరీక్షలకు ఎంపిక చేశారు. ఆ పరీక్షలను మార్చిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రిలిమినరీ రాతపరీక్షలో తప్పు ప్రశ్నలను తొలగించకుండా.. వాటికి మార్కులను జోడించాలనే డిమాండ్ మొదలైంది. దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిని విచారించిన కోర్టు మార్కులు కలిపి వేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో 8 మార్కులు కలిపి 52 వేల మంది అదనంగా అర్హత సాధించారు.
Yadagirigutta: 21 నుంచి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్ దంపతులు
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!