Yadagirigutta: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వార్సిక బ్రహ్మోత్సవాలు ముహూర్తం ఖరారైంది. ఈనెల 21 మాఘ శుద్ధ పాడ్యమిన స్వస్తివాచనం, అంకురారోపణం, విశష్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 3వరకు అత్యంత వైభవోపేతంగా సాగే వేడుకల్లో 27న ఎదుర్కోలు, 28న స్వామివారి తిరుకల్యాణోత్సవం, మార్చి ఒకటిన దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. నాలుగు రోజులపాటు అలంకార సేవలు చేపట్టనున్నారు. కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. కేసీఆర్ సంకల్పంతో రూ.1,250 కోట్లతో మహాద్భుతంగా రూపుదిద్దుకున్న ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం వస్తున్న తొలి బ్రహ్మోత్సవాలు అవడంతో కనీవినిఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. కల్యాణోత్సవాన్ని గతంలో మాదిరి కాకుండా ఈసారి కొండపైన తిరుమాఢవీధుల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. పది వేల మంది భక్తులు కూర్చుని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇక ప్రధానాలయం ప్రాంగణంలోనే స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం చేపట్టనున్నారు.
Read also: Astrology : ఫిబ్రవరి 15, బుధవారం దినఫలాలు
ప్రధానాలయం ఉత్తర ప్రాంతంలోని వాయుదిశలో నిర్మించిన లిఫ్ట్, రథశాల ప్రాంతంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 28న రాత్రి 8 గంటలకు తిరు కల్యాణోత్సవం జరుపనుండగా అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకారం, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ నిర్వహించనున్నారు. దీని కోసం 56 ఫీట్ల పొడవు, 28 ఫీట్ల వెడల్పుతో ప్రత్యేక కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక కల్యాణ మండపం ఎదురుగా ఉత్తర మాఢ వీధుల్లో 10 వేల మంది భక్తులు కూర్చునే విధంగా వసతులు కల్పించనున్నారు.. వీవీఐపీ, వీఐపీలతోపాటు కల్యాణంలో పాల్గొనే భక్తులు, అర్చకులు, డోనర్లు, మీడియా కోసం ప్రత్యేకమైన లాబీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో.. భక్తులకు కల్యాణతంతు స్పష్టంగా కనినిపించే విధంగా 8 ఎల్‌ఈడీ స్క్రీన్లను బిగించనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణం చేయించుకునే భక్తులకు రూ. 3,000 టికెట్ ధరను నిర్ణయించారు. లక్ష్మీనరసింహస్వామి కల్యాణం అనంతరం దాతలకు శేష వస్త్రంగా ఒక ఉత్తరీయం, కనుము, అభిషేకం లడ్డూ, 2 వడలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. ఇక గతంలో స్వామివారి కల్యాణం ఉదయం కొండకింద పాత హైస్కూల్ మైదానంలో నిర్వహించేవారు. ఇక పునర్నిర్మాణం అనంతరం ప్రధానాలయంతోపాటు ఆలయ మాఢ వీధులు విశాలంగా ఉండడంతో ఈసారి బ్రహ్మోత్సవాలను కొండపైనే నిర్వహిస్తున్నారు.
Read also: Crime News: దారుణం.. టీ గార్డెన్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య
బ్రహ్మోత్సవాలకు బస్సుల్లో వచ్చే భక్తులకు ఆటంకం కలుగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంతోపాటు నల్లగొండ, వివిధ ప్రాంతాల నుంచి నుంచి భక్తులు ఎక్కువగా వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భాగ్యనగరం- సికింద్రాబాద్ నుంచి ప్రతి అరగంటకు గుట్టకు ఒక బస్సు ఉన్నది. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి కూడా బస్సులు నడుస్తున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట బస్టాండ్ నుంచి కొండపైకి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక.. ఇప్పటికే 4 బస్సులు కొండపైకి నడుస్తుండగా అదనంగా మరో 3 బస్సులను ఏర్పాటు చేయనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 21 నుంచి 3 వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓ రామకృష్ణ తెలిపారు. ఇక.. స్వామివారి రాత్రి నివేదన అర్చన తదుపరి 8.15 నుంచి 9.00 గంటల వరకు బలిహరణ, ఆరగింపు రద్దు చేయనున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి మార్చి 3 సాయంత్రం వరకు భక్తులతో నిర్వహించే అర్చనలు, బాలభోగాలు నిలిపివేస్తున్నట్లు.. 27 నుంచి మార్చి 1 వరకు అభిషేకం, అర్చనలు రద్దు చేయనున్నట్లు ప్రకటించారు.
Lay Foundation Stone For Steel Plant: నేడు సొంత జిల్లాకు సీఎం జగన్.. స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ…