తెలంగాణలో సంచలనం కలిగిస్తున్న మొయినాబాద్ ఫాం హౌస్ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే అంశంపై ప్రత్యేక బృందంతో విచారణ కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన వారి రిమాండ్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్….హై ప్రొఫెషనల్ కేసులో ఏసీబి కోర్టు రిమాండ్ తిరస్కరించిందన్నారు ఏజీ.
Read Also: Horrific Accident: 70అడుగుల లోతులో పడిన కారు.. పండుగపూట విషాదం
రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అన్ని ఆధారాలు సమర్పించారన్నారు ఏజీ. అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టు 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని, పోలీసులు ఈ కేసులో ప్రొసీజర్స్ ఫాలో కాలేదని రిమాండ్ తిరస్కరించిందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు ఉన్నాయంది హైకోర్టు.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను 50 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టారన్నారు. టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి మారాలని ఆఫర్ చేశారన్నారు ఏజీ. ఈడీ, సిబిఐ కేసుల నుండి కాపాడుతామని కూడా చెప్పారన్నారు ఏజీ.
అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో ఎక్కడా కూడా ఖచ్చితంగా 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని చెప్పలేదన్నారు. ప్రతి కేసులో 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చెయ్యాలని లేదన్నారు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. ఇది పక్కాగా ట్రాప్ చేసారా అని ప్రశ్నించింది హైకోర్టు..కెమెరాలు, ఆడియో రికార్డింగ్ వ్యవస్థ ముందే ఫాంహౌజ్ లో ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించింది హైకోర్టు. అన్ని సెట్ చేసి ట్రాప్ చేశామన్నారు ఏజీ. ప్రతి కేసులో నిందితుడికి 41a crpc నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన లేదన్నారు ఏజీ.
Read Also: Ts Highcourt: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేపటికి వాయిదా
వేదుల శ్రీనివాస్ నిందితుల తరపు న్యాయవాది తమ పిటిషనర్ల పై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎలాంటి నగదు సంఘటన స్థలం వద్ద దొరకలేదు..హై ప్రొఫెషనల్ కేసులో ప్రతి ఒక్కరికి 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలి..అవినాష్ కుమార్ జడ్జిమెంట్ లో చాలా అంశాలు పొందుపరచారు. ఈరోజు సాయంత్రం వరకు అరెస్ట్ అయినా ముగ్గురు అడ్రస్ లు సీపీ కి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశాలిచ్చింది. 24 గంటల పాటు నిందితులు ఎటు వెళ్ళడానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. కేసు వివరాలు అఫిడవిట్స్ అన్ని ప్రతివాదులకు ఇవ్వాలని ఏజీ కి హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై రేపు ఆదేశాలు జారీచేస్తామంది హైకోర్టు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.