Naresh- Pavitra: సీనియర్ నటుడు నరేష్- నటి పవిత్రా లోకేష్ ల మధ్య ఉన్న బంధం గురించి, ఆ బంధం చుట్టూ ఉన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడం ఆలస్యం నరేష్ మూడో భార్య రమ్య రంగంలోకి దిగి మీడియా ముందు చేసిన రచ్చ ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇక ఎవరు ఎన్ని అనుకున్నా తామిద్దరం కలిసే ఉంటామని, నరేష్ కు జీవితాంతం తోడు ఉంటానని పవిత్ర చెప్పడం హైలైట్ గా నిలిచింది. ఇక కొన్ని రోజుల నుంచి ఈ జంట విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నరేష్ వేరే నటితో చనువుగా ఉంటున్నాడని, పవిత్ర తన సినిమాలతో బిజీగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజాలు లేవని రుజువులేశారు ఈ జంట.
తాజాగా ఇద్దరు మీడియా ముందుకు వచ్చి ఆలీ నిర్మించి నటించిన అందరు బావుండాలి.. అందులో మనముండాలి సినిమాను ప్రమోట్ చేశారు. ఇటీవలే ఆహా లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో తాము రాత్రి నుంచి పండగ చేసుకుంటున్నామని, మంచి కంటెంట్ వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు అయ్యిందని చెప్పుకొచ్చారు. తమను, తమ సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నరేష్, పవిత్ర భుజాల మీద చేయి వేసి మరీ మాట్లాడడం అనేది కొంచెం అతిగా అనిపించినా వారిద్దరూ తమ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉందని చెప్పడానికి ఆ విధంగా చేయి వేసి మరీ చెప్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.