Telangana Highcourt : తెలంగాణ హైకోర్టు 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ప్రకటించిన 2008 నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలను ఇప్పటి వరకు భర్తీ కానీ 3500 పోస్టుల విషయంలో కీలక తీర్పు వెలువరించింది. అందులో భర్తీ చేయకుండా ఉన్న 1815 పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని తెలంగాణ సర్కారుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 14ఏళ్ల నిరీక్షణ తర్వాత డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేకూరినట్లయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…
తెలంగాణలో పోలీస్ అధికారులకు హైకోర్టు 4 వారాల జైలు శిక్ష విధించింది. నలుగురు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు వెల్లడించింది. నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది. నలుగురికి 4 వారాల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని నలుగురిపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని పోలీసులపై అభియోగం నమోదైంది. Niranjan Reddy: త్వరలోనే ఇంగ్లీష్…
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విషయంలో తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. బంజారాహిల్స్ పీఎస్ లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై నమోదైన కేసులో ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంది హైకోర్టు. ఈమేరకు పోలీసులకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కార్టూన్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎంపీ అరవింద్. ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఓ కేసు నమోదైంది. సీఎం కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేసి సమాజంలో…
2018 తెలంగాణ, ఒరిస్సా సరిహద్దులో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018లో తెలంగాణ, ఒరిస్సా సరిహద్దు చర్ల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ పూర్తి అయింది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టుల మృతి చెందిన సంగతి తెలిసిందే. బూటకపు ఎన్ కౌంటర్ అంటూ ప్రజా హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేశాయి. చనిపోయినవారికి రీ పోస్టుమార్టం, పోలీసులపై హత్యా నేరం కింద కేసు పెట్టాలని…
ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలయింది. న్యాయ విద్యార్థి బొమ్మనగారి శ్రీకర్ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేయక రైతులు నష్టపోతున్నారన్నారు న్యాయవాది అభినవ్. దీనిపై విచారణ డిసెంబరు 6కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశం రాజకీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గుండెపోటు బారిన పడుతున్నారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని హైకోర్టులో దాఖలైన పిల్‌లో…
దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ సందర్బంగా దిశ కమిషన్ విచారణ తీరుపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు. డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. దిశ కమిషన్ విచారణ చట్ట విరుద్దంగా జరుగుతోందన్న వాదన తోసిపుచ్చింది హైకోర్టు. తమను చివరగా విచారణ జరిపేలా ఆదేశించాలన్న అభ్యర్థనను నిరాకరించింది హైకోర్టు. విచారణ తీరును నిర్ణయించుకునే అధికారం కమిషన్ కు ఉంటుందని హైకోర్ట్ పేర్కొంది. 2019, నవంబర్ 27న…