ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు కృష్ణానదిపై నిర్మిస్తోన్న ప్రాజెక్టులు చిచ్చుపెడుతున్నాయి.. ఓవైపు ఫిర్యాదులు చేస్తూనే.. మరోవైపు ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. జలవివాదంలో ఆంధ్ర నేతలపై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇప్పటికే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై విమర్శలు రాగా.. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. వైఎస్సార్ తెలంగాణ ప్రాంతానికి రాక్షసుడు అంటూ విమర్శించారు. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ స్నేహ హస్తం ఇస్తే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ద్రోహ హస్తం ఇస్తున్నారంటూ ఫైర్ అయిన మర్రి జనార్ధన్‌రెడ్డి… ఆంధ్ర ప్రజలతో ఆడుకో.. కానీ, పులులు, సింహాలతో ఆడాలని అనుకోకు అంటూ వార్నింగ్ ఇచ్చారు.. వడ్లు పండించడంలో ఖమ్మంతో పాలమూరు జిల్లా పోటీ పడుతోందని వెల్లడించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. తమ ప్రభుత్వ హయాంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు.