వీణవంక మండలం గన్ముకల గ్రామంలో టీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఉద్యమ కారుడైన గెల్లు.శీను తో 2004 నుండి నాకు పరిచయం ఉంది. గెల్లు శీను ను భారీ మెజారిటీతో గెలిపించాలి అన్నారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకు వస్తానని మాట తప్పారు నరేంద్రమోడీ అని అన్నారు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది. కాంగ్రెస్ బీజేపీలు అధికారం ఉన్న రాష్ట్రాలలో 24 గంటల కరెంటు ఎందుకు లేదో చెప్పాలి. రెండు వందల నుంచి 2 వేల పెన్షన్ పెంచిన ఘనత కేసీఆర్ ది. ఎస్ఆర్ఎస్ పి కాలువల ను తవ్వించాం అని శ్రీధర్ బాబు అంటున్నారు .30 ఏళ్లలో నత్త కంటే హీనంగా పనులు చేస్తే ఐదేళ్ల లో ప్రాజెక్టులు ఘనత కేసీఆర్ ది అని తెలిపారు. ఇక పెంచిన పెట్రోల్ ,డీజిల్ వంటగ్యాస్, ధర లకు నిరసనగా హుజురాబాద్ ఎన్నికల ద్వారా మోడీ గూబ గుయ్యిమనిపించేలా తీర్పు ఇవ్వాలి. కేసీఆర్ గుమ్మడికాయ అంత అభివృద్ధి పనులు చేస్తే, అందులోకి పెసరి కాయంత నిధులు ఇచ్చుకుంటు, బీజేపీ వాళ్లు మా పథకాలు అంటూ ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు.