Malla Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన హాస్యశైలితో నవ్వులు పూయించారు. పంచ్ డైలాగులతో సామాజిక మాధ్యమాల్లో తరచూ ట్రెండింగ్‌లో ఉండే మల్లారెడ్డి, తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఆసక్తి రేకెత్తించాయి. ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ, “నేను రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ప్రభుత్వానికి రూ. 1100 కోట్లు లాభం వచ్చే అంశం, రెండోవది మా మేడ్చల్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, కౌన్సిలర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి” అని…
నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్‌ఎస్‌లో కొంత కాలంగా పార్టీ నేతల మధ్య పొసగడం లేదు. ఎమ్మెల్యే షకీల్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మ భర్త శరత్‌రెడ్డి మధ్య వైరం శ్రుతిమించింది. ఒకే పార్టీ అయినప్పటికీ..చిన్నగా మొదలైన విభేదాలు రెండు వర్గాలను శత్రువులుగా మార్చేశాయి. బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం కంటే ముందు వరకు.. ఎమ్మెల్యే షకీల్‌కు… శరత్ రెడ్డి ప్రధాన అనుచరునిగా ఉండేవారు. శివాజీ విగ్రహ విషయంలో శరత్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు గుర్తించి…
తెలంగాణలో వరసగా మూడోసారి అధికారంలోకి రావడానికి టీఆర్‌ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ టికెట్ దక్కించుకుంటే.. గెలుపు ఈజీ అనే ఆలోచనలో ఉన్నారు ఆశావహులు. ఇప్పటికే కొందరు నాయకులు నియోజకవర్గాలపై కర్చీఫ్‌లు వేసే పనిలో బిజీ అయ్యారు. గతంలో ఒకసారి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహించి.. వివిధ కారణాలతో ప్రస్తుతం మరో పదవిలో ఉన్నవారు.. తిరిగి పట్టు సాధించే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో స్వయంగా బరిలో దిగాలని చూస్తున్నారట. వీలుకాకపోతే కుటుంబసభ్యులకైనా టికెట్ ఇప్పించుకోవాలనే ఆలోచనతో…
ఆయన అధికారపార్టీని వీడింది లేదు. కాకపోతే ఎన్నికల్లో ఓడిన తర్వాత సైలెంట్ అయిపోయారు. బయట కనిపించలేదు.. పార్టీ కార్యక్రమాల్లో నల్లపూసయ్యారు. అలాంటి నాయకుడు.. నేను పార్టీలోనే ఉన్నానోచ్ అని చెబుతున్నారట. ఎందుకలా? ఎవరా నేత? ‘నేను టీఆర్ఎస్‌లోనే ఉన్నా..’ అని చెబుతున్న జలగంఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. అక్కడి పరిణామాలు అనూహ్యంగా చర్చల్లోకి వస్తాయి. అలా అందరి నోళ్లల్లో నానుతుందే కొత్తగూడెం నియోజకవర్గం. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ ఎపిసోడ్ రాజకీయాల్లో…
ఖమ్మం జిల్లాగా పాలేరు నియోజకవర్గాన్ని చూశానన్నారు టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు. కులమతాలకు, పార్టీల అతీతంగా అభివృద్ధికి కృషి చేశానన్నారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో మీ ఆశీస్సులతో బై ఎలక్షన్ లో గెలుపొంది మీ నియోజకవర్గం లోని గ్రామాల ముఖచిత్రాన్ని మార్చేశా అన్నారు తుమ్మల. ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలను అభివృద్ధి చేశానన్నారు. నలభై సంవత్సరాలుగా…
టీఆర్ఎస్ నేత, మాజీమంత్రి మహమ్మద్ ఫరీదుద్దీన్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో వున్నారు. వారం కిందటనే కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన తిరిగి రాని లోకాలకు చేరారు. ఆయన చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో ఆయన అందరికీ చేయి ఊపుతూ కనిపించారు. ఫరీదుద్దీన్ అకాల…
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ఎంతో మంది ధన రూపేన, వస్తు రూపేన కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ నేతలు యాదాద్రి ఆలయానికి విరాళం ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ఎం. హనుమంత రావు, ఎం కృష్ణ రావుతో పాటు కెపి వివేక్ ఆనంద్ లు…
వీణవంక మండలం గన్ముకల గ్రామంలో టీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఉద్యమ కారుడైన గెల్లు.శీను తో 2004 నుండి నాకు పరిచయం ఉంది. గెల్లు శీను ను భారీ మెజారిటీతో గెలిపించాలి అన్నారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకు వస్తానని మాట తప్పారు నరేంద్రమోడీ అని అన్నారు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది. కాంగ్రెస్ బీజేపీలు అధికారం ఉన్న రాష్ట్రాలలో 24 గంటల కరెంటు ఎందుకు లేదో చెప్పాలి. రెండు…
రాజకీయాల్లో ఉన్నప్పుడు మాటలు పొదుపుగా వాడాలి. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ స్టేట్‌మెంట్ ఆ మాజీ మంత్రి రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసిందని టాక్. దీంతో పార్టీలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందట. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథా? టీఆర్‌ఎస్‌లో ఉనికి కోసం పోరాటం? కడియం శ్రీహరి. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం. టీఆర్‌ఎస్ నాయకుడు. ప్రస్తుతం చేతిలో ఎలాంటి పదవి లేదు. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని…
రాజకీయాల్లో ఒకప్పుడు ఆయన చక్రం తిప్పారు. మధ్యలో చర్చల్లో లేకుండా పోయారు. ఇప్పుడు అధినేత ఫ్రేమ్‌లో ఉన్నారో లేరో కూడా తెలియదు. అప్పుడెప్పుడో బాస్ ఇచ్చిన మాట మేరకు.. పిలుపు రాకపోతుందా అని ప్రగతిభవన్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. మళ్లీ లైమ్‌లైట్‌లోకి వస్తారా? ఈ దఫా పదవి రాకపోతే.. రాజకీయ భవిష్యత్ కష్టమేనా? అధికార పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎమ్మెల్సీ కావాలని చందర్‌రావు ఆశ! వేనేపల్లి చందర్‌రావు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు బలమైన…