Cyberabad Traffic Diversion: సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మాదాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించనున్న మెట్రోరైలు నిర్మాణ పనుల శంకుస్థాపనలో భాగంగా.. రేపు (ఈనెల9)న సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని మాదాపూర్, నార్సింగి ఠాణాల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక, మాదాపూర్‌లోని రహేజ, మైండ్ స్పేస్ జంక్షన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఉదయం 8.30 నుంచి ఈనేపథ్యంలో.. మధ్యాహ్నం 3గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. అయితే.. కావూరి హిల్స్ నుంచి సైబర్ టవర్స్, రాబ్ కేపీహెచ్‌బీ నుంచి సైబర్ టవర్, హైటెక్స్ జంక్షన్ నుంచి సైబర్ టవర్, టీసీఎస్ జంక్షన్ నుంచి సైబర్ టవర్, ఎన్ఐఏ నుంచి ఎస్బీఐ పర్వత్నగ, నీరస్ జంక్షన్ నుంచి పర్వత్‌నగర్.. తదితర ప్రాంతాల్లోట్రాఫిక్ ప్రభావం ఉంటుందని డీసీపీ తెలిపారు.
ట్రాఫిక్ డైవర్షన్లు..
ఇక నార్సింగి పీఎస్ పరిధిలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మొయినాబాద్ నుంచి హిమాయత్‌సాగర్ రోడ్, టిపుఖాన్ బ్రిడ్జి నుంచి టీఎస్పీఏ రోడ్, నార్సింగి నుంచి టీఎస్పీఏ రెండు సర్వీసు రోడ్లు, రాజేంద్రనగర్ నుంచి టీఎస్పీఏ రోడ్డు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం.18 పరిధిలోని అన్ని టోల్ బూత్‌లు, ట్రాఫిక్ రద్దీగా ఉంటుందని డీసీపీ తెలిపారు. ఈసందర్బంగా.. రాజేంద్రనగర్ నుంచి కాళిమందిర్, టిపుఖాన్ బ్రిడ్జి నుంచి మొయినాబాద్, శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కాళిమందిర్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి టీఎస్పీఏ, గచ్చిబౌలి సర్వీస్‌రోడ్ నుంచి టీఎస్పీఏ, చేవెళ్ల, మొయినాబాద్ నుంచి టీఎస్పీఏ, కేపీహెచ్‌బీ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి, ఖాజాగూడ వైపు భారీ వాహనాలపై ఆంక్షలు విధించారు.
ఇక, చేవెళ్ల, మొయినాబాద్, బండ్లగూడ, కాళిమందిర్, సన్‌సిటీ, రాజేంద్రనగర్, ఆర్జీఐఏ, టీఎస్పీఏ, నార్సింగి రోటరీ, గచ్చిబౌలి, లంగర్‌హౌస్, శంకర్పల్లి, టిపుఖాన్ బ్రిడ్జి, హిమాయత్‌సాగర్, శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కాళిమందిర్, రాజేంద్రనగర్ నుంచి కాళిమందిర్, బండ్లగూడ, సన్‌సిటీ వైపు వెళ్లే వాహనాలను రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ టోల్గేట్ వద్ద దారి మళ్లించి, రాజేంద్రనగర్ విలేజ్, బుద్వేల్, కిస్మత్పూర్, కాళిమందిర్ మీదుగా అనుమతిస్తారు. దీంతో.. ఆయా ప్రాంతాల్లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపును దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని డీసీపీ కోరారు.
CM KCR: నేడు కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. మాజీ మేయర్ కూతురు వివాహ వేడుకకు హాజరు