Shamirpet Police Station : దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట్ పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను MHA పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో…
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ సీఐడీకి బదిలీ చేసింది. పంజాగుట్ట, మియాపూర్ లో నమోదైన కేసులో 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను విచారించారు. మరోవైపు.. ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పైన సిట్ ఏర్పాటు చేసింది. ఒకవైపు సీట్ తో పాటు కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్, శంషాబాద్, బాలానగర్, మేడ్చల్ జోన్లలో చోరీలకు పాల్పడ్డ దొంగలను పట్టుకున్నారు. నాలుగు జోన్ల పరిధిలో 1060 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో, ఒంటరిగా వెళుతున్న వారిని టార్గెట్‌గా చేసుకొని సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకున్నారు. CEIR పోర్టల్ ల్లో సెల్ ఫోన్ లను పోగొట్టుకొని నమోదు చేసుకున్న వారికి తిరిగి…
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. నో ఎంట్రీ రోడ్లోకి అత్యంత వేగంగా దూసుకొచ్చిన లారీ.. రోడ్డు మధ్యలో ఉన్న ట్రాఫిక్ అంబరిల్లాను ఢీకొన్నది. ఈ సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ హోంగార్డ్ సింహాచలం మృతి చెందాడు. పోలీస్ కానిస్టేబుల్ రాజవర్ధన్, వికేందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా్ప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.…
Buy Back : సైబరాబాద్ లో బై బ్యాక్ పేరుతో మరో భారీ మోసం బయటపడింది. అధిక వడ్డీలు చెల్లిస్తామంటూ బాధితులను నిండా ముంచేశారు. పలు స్కీముల పేరుతో ఆటపాకల వెంకటేశ్, సురేష్ అనే ఇద్దరు ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. వి ఓన్ ఇన్‌ఫ్రా గ్రూప్స్ బై బ్యాక్ పేరుతో ఈ వసూళ్లకు పాల్పడ్డారు. పెట్టిన పెట్టుబడికి డబుల్ వడ్డీ వస్తుందంటూ నమ్మించారు. వారి మాటలు నమ్మి దాదాపు 90 మంది పెట్టుబడులు పెట్టారు. రియల్…
సైబరాబాద్ పరిధిలో భారీ స్కాం వెలుగుచూసింది. రూ.300 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. కూకట్‌పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో బడా మోసానికి పాల్పడింది. ఈ మోసంలో 3600 మంది బాధితులు చిక్కుకుపోయారు.
సైబరాబాద్ పోలీసులు రెండు వేల సెల్ ఫోన్లు రికవరీ చేశారు. ఆరు నెలల కాలంలో రెండు వేల సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీ లేదా మిస్ అయిన సెల్ ఫోన్ లోని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు.
Traffic Restrictions: హైదరాబాద్ నగరంలో రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో రేపు (ఆదివారం) ఉదయం 4. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.
సైబరాబాద్ పరిధిలో ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులపై బుల్డోజర్స్తో పోలీసులు యాక్షన్లోకి దిగారు. మొదటిసారి అక్రమార్కులపై బుల్డోజర్స్ అస్త్రాన్ని ప్రయోగించారు. గండిపేటలో ఓ డాక్టర్ స్థలంను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు కబ్జాదారులు. ఈ స్థల వివాదంలో ఎమ్మార్పీఎస్ నేత నరేందర్ తో పాటు మరొకరిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన ఎమ్మార్పీఎస్ నేతను శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో పెట్టి హింసించారు. అంతేకాకుండా.. 20 కుక్కలు, పొట్టేళ్ల మధ్యలో నరేందర్ను చిత్రహింసలకు గురిచేశారు…
మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి అని తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు.