CM KCR to Karimnagar today: నేడు సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు కరీంనగర్ కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం మాజీ మేయర్ రవిందర్ సింగ్ కూతురు వివాహ వేడుకలో హాజరు కానున్నారు. నవ దంపతులను ఆశీర్వదించనున్నారు సీఎం. అక్కడి నుంచి అనంతరం మంత్రి గంగుల నివాసానికి వెళ్ళనున్నారు. పలు మంత్రులతో సమావేశ అనంతరం అక్కడి నుంచి 2 గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్న కేసీఆర్. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: World Richest Person: ప్రపంచ కుబేరులు.. ఫస్ట్ ప్లేస్ కోల్పోయిన ఎలాన్ మస్క్.. వివరాలు ఇవిగో..
ఇక నిన్న జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే..ఇంకో 5-10 రోజుల్లో రైతుబంధు డబ్బులు పడతాయని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ ఉందని.. అందులో నిర్ణయం తీసుకుని రైతుబంధు డబ్బులను విడుదల చేస్తామని అన్నారు. తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యే వరకు, కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదని ఆయన అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలో 24 గంటల వ్యవసాయ కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని.. రైతుబంధు, రైతుబీమా ఇచ్చే రాష్ట్రం తెలంగాణే అని అని అన్నారు. తెలంగాణ రైతులు బలపడాలని తీసుకున్న నిర్ణయాలే రైతుబంధు, రైతుబీమా అని అన్నారు. దేశంలో రైతుల ధాన్యాన్ని ఏ ప్రభుత్వం కూడా కొనుగోలు చేయలేదని, 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణే అని అన్నారు.
TTD : తిరుమలలో అవినీతి రాజ్యమేలతావుంది.. ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలనం