Mahesh Kumar Goud : తెలంగాణ రాక ముందు, ఇప్పుడు మీ ఆస్తులు ఎంతా?.. చర్చకు వస్తారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు అంత ద్రోహులు అని అనడం చరిత్రను వక్రీకరించడమే అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. తాజాగా ఆయన ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది అని అసెంబ్లీలో కేసిఆర్ చెప్పారని, రాజకీయ భోగాలు అనుభవిస్తున్నది మీరు.. తెలంగాణ కాంగ్రెస్ నష్టపోతుంది అని తెలిసి కూడా ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. కవిత పుట్టకముందే మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేశారని, బతుకమ్మ, వంటావార్పు చేస్తే తెలంగాణ వచ్చింది అని అనుకుంటున్నారన్నారు. తెలంగాణ వస్తే ఎవరు బాగుపడ్డరు రాష్ట్రంలో… కవిత పుట్టక ముందే ఇందిరా గాంధీ బతుకమ్మ ఎత్తుకున్నారన్నారు. తెలంగాణ రాక ముందు, ఇప్పుడు మీ ఆస్తులు ఎంతా?.చర్చకు వస్తారా అని ఆయన సవాల్ విసిరారు.
Also Read :Nara Brahmani : వావ్.. నారా బ్రహ్మణిలో మరో టాలెంట్.. లడక్‌లో బైక్ రైడింగ్ వీడియో..
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
అసైన్డ్ భూములు కూడా వదలడం లేదని, హైదరాబాద్ చుట్టూ ఉన్న 80 శాతం భూములు మీ చేతుల్లో ఉన్నాయన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాల పరిస్థితి ఏంటి అని ఒక్కసారి అయినా ఆలోచించారా అని మహేశ్‌కుమార్ మండిపడ్డారు. ఇప్పుడు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న 80 శాతం మంది ఉద్యమకారుల మీద రాళ్ళు రువ్విన వల్లేనని, మీరు చేసిన ఘనకార్యం రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు.
తెలంగాణ వచ్చిన ప్రజల బతుకులు మారలేదని, మీ కుటుంబ సభ్యుల బతుకులు బంగారం అయ్యాయన్నారు. ధరణి వల్ల ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి చంపే పరిస్తితి వచ్చిందన్నారు. పోడు భూముల సమస్యల వల్ల శ్రీనివాస్ అనే ఎఫ్‌ఆర్‌వో అధికారి చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కవిత తెలంగాణ కాంగ్రెస్ గురించి మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారన్నారు.
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!