ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ECIL Recruitment 2026: ఐటీఐ పూర్తి చేసి సరైన కెరీర్ అవకాశం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (PSU) ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) అదిరిపోయే శుభవార్త అందించింది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా, దరఖాస్తు ఫీజు కూడా లేకుండానే 310 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. నేరుగా ఐటీఐ మెరిట్ మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసి, ప్రతి నెలా స్టైపెండ్‌తో పాటు ఒక సంవత్సరం పాటు అనుభవం అందించే శిక్షణ ఇవ్వనున్నారు.
రాత పరీక్ష లేకుండా మెరిట్‌తోనే ఎంపిక
తాజా రిక్రూట్మెంట్లో అత్యంత కీలక విశేషం ఏంటంటే, అభ్యర్థులు ఎలాంటి రాత పరీక్షకు హాజరుకావాల్సిన అవసరం లేదు. ఐటీఐ కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితాను రూపొందిస్తారు. మొత్తం 310 సీట్లలో 70 శాతం సీట్లను ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు, మిగిలిన 30 శాతం సీట్లను ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు కేటాయించారు. మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన వారికి స్వల్ప సమాచారంతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వివరాలు అందిస్తారు. ఈ నియామక ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది.
Also Read
- Income Tax Jobs 2026: 10th, ఇంటర్ అర్హతతో.. ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS పోస్టులు
- APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
- India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు:
మొత్తం 310 పోస్టుల్లో పలు కీలక ట్రేడ్లకు పెద్ద సంఖ్యలో ఖాళీలను కేటాయించారు:
ఫిట్టర్: 87 ఖాళీలు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (EM): 86 ఖాళీలు
ఎలక్ట్రీషియన్: 50 ఖాళీలు
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA): 41 ఖాళీలు
వెల్డర్: 16 ఖాళీలు
టర్నర్: 08 ఖాళీలు
మెకానిక్ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్: 05 ఖాళీలు
మెషినిస్ట్ (G): 02 ఖాళీలు
పెయింటర్: 02 ఖాళీలు
కార్పెంటర్: 02 ఖాళీలు
ప్లంబర్: 02 ఖాళీలు
డీజిల్ మెకానిక్: 02 ఖాళీలు
అర్హతలు & వయోపరిమితి:
* గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో NCVT సర్టిఫికెట్తో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్టంగా 25 ఏళ్లు మించకూడదు.
* నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్ల వరకు, దివ్యాంగ (PwBD) అభ్యర్థులకు అదనంగా 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ & ముఖ్యమైన తేదీలు:
అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా కేంద్ర ప్రభుత్వ పోర్టల్ `www.apprenticeshipindia.gov.in` లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈసీఐఎల్ అధికారిక వెబ్సైట్ `www.ecil.co.in` లోని ‘హ్యూమన్ రిసోర్సెస్ -> కరెంట్ జాబ్ ఓపెనింగ్స్’ విభాగం ద్వారా దరఖాస్తు సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11 అక్టోబర్ (రాత్రి 11:59 గంటల వరకు).
డాక్యుమెంట్ వెరిఫికేషన్: 22 అక్టోబర్ నుంచి 24 అక్టోబర్ 2026 వరకు.
వెరిఫికేషన్ జరిగే వేదిక: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (CLDC), నలంద కాంప్లెక్స్, TIFR రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్ – 500062.
తుది ఎంపిక ఈమెయిల్స్ పంపే తేదీ: 28 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ 2026 వరకు.
ట్రైనింగ్ ప్రారంభం: 2 నవంబర్ 2026.
తాజావార్తలు
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
-
Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
-
Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!