Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- తొలి 1.6 కిలోమీటర్లకు రూ.30 కనీస ఛార్జీ
- ఆ తర్వాత కిలోమీటరుకు రూ.14 చొప్పున వసూలు
- రాత్రి వేళల్లో 1.5 రెట్లు అదనపు ఛార్జీ
- డిజిటల్ మీటర్ల రీసెట్టింగ్పై కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Auto Fare Hike: రాష్ట్రంలో ఆటోరిక్షా ప్రయాణ ఛార్జీల సవరణకు సంబంధించి నూతన నిబంధనలు, రుసుముల వివరాలను ప్రభుత్వం సవరించింది. ప్రయాణికులపై పడే భారాన్ని, ఆటో డ్రైవర్ల నిర్వహణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త విధానాన్ని ఖరారు చేశారు. నూతన నిబంధనల ప్రకారం తొలి 1.6 కిలోమీటర్ల ప్రయాణానికి కనీస ఛార్జీగా రూ. 30 నిర్ణయించారు. ఆ తర్వాత ప్రయాణించే ప్రతి అదనపు కిలోమీటరుకు రూ. 14 చొప్పున వసూలు చేయనున్నారు. ఇక ప్రయాణంలో ట్రాఫిక్ లేదా ఇతర కారణాల వల్ల వాహనం నిలిచిపోయినప్పుడు వర్తించే వెయిటింగ్ ఛార్జీలను నిమిషానికి 75 పైసలుగా నిర్ణయించారు.
రాత్రి వేళల్లో అదనపు ఛార్జీలు.. లగేజీపై స్పష్టత
రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక ఛార్జీల విధానం వర్తించనుంది. రాత్రి 11.00 గంటల నుంచి ఉదయం 5.00 గంటల మధ్య నడిచే ఆటోలకు సాధారణ ఛార్జీ కంటే ఒకటిన్నర రెట్లు (1.5 రెట్లు) అధికంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ప్రయాణికులతో పాటు ఉండే సామాను విషయంలోనూ స్పష్టమైన సడలింపులు ఇచ్చారు. చిన్న తరహా బ్రీఫ్ కేస్, హ్యాండ్ బ్యాగ్, 60×40 సెంటీమీటర్ల కంటే తక్కువ కొలతలు కలిగిన అటాచ్డ్ కేసులు లేదా బ్యాగులకు ఎలాంటి అదనపు రుసుము ఉండదు. వీటి కంటే పెద్దగా ఉండే ప్రతి ప్యాకేజీకి రూ. 0.50 పైసల చొప్పున లగేజీ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆటోలో గరిష్టంగా 100 కిలోగ్రాముల వరకు లగేజీని అనుమతిస్తారు.
Also Read
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
డిజిటల్ ఆటో మీటర్ల రీసెట్టింగ్ నిబంధనలు
నూతన టారిఫ్‌కు అనుగుణంగా ఆటోల్లో ఉండే డిజిటల్ మీటర్లలో మార్పులు చేయాలని స్పష్టం చేశారు. ప్రయాణం ప్రారంభంలో డిజిటల్ మీటర్‌ను ఆన్ చేసిన వెంటనే కనీస ఛార్జీగా రూ. 30.00 నమోదు కావాలి. ప్రారంభ 1.60 కిలోమీటర్ల ప్రయాణం పూర్తయిన తర్వాత, తదుపరి ప్రయాణంలో ప్రతి 1/10వ కిలోమీటరుకు (ప్రతి 100 మీటర్లకు) రూ. 1.40 పైసల చొప్పున ఛార్జీ పెరుగుతూ ఉండేలా మీటర్ సెట్టింగ్‌లను మార్చాల్సి ఉంటుంది. పారదర్శకమైన సేవల కోసం ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని రవాణా శాఖ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!