పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని ఆరోపిస్తూ సీఎం కేసీఆర్‌పై సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ వరప్రసాద్‌కు ఫిర్యాదుతో పాటు రాజ్యాంగం ప్రతిని కూడా అందజేశారు. తమ ఫిర్యాదు ఆధారంగా సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి కూడా పాల్గొన్నారు.
Read Also: సీఎం కేసీఆర్‌కు జ్వరం.. ప్రధాని కార్యక్రమానికి దూరం
కాగా అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… అంతర్జాతీయ దేశద్రోహుల కంటే కేసీఆర్ ప్రమాదకర వ్యక్తి అని ఆరోపించారు. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రేవంత్ హెచ్చరించారు. కేసీఆర్‌పై కేసు నమోదు చేసి శిక్షించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.