ఎస్కలేటర్లపై నడవడాన్ని నిషేధించిన జపాన్..కారణం ఏంటో తెలుసా?
జపాన్‌లో, నగోయా ప్రజలు ఎస్కలేటర్‌లపై నడవడాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని ఆమోదించారు. అవును, మీరు చదివింది నిజమే. అసాధారణమైనటు వంటి ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో అక్టోబర్ 1 నుండి నగోయాలో ఎస్కలేటర్లపై నడవడంపై నిషేధం అమల్లోకి వచ్చింది.. జపాన్‌లో, ప్రయాణీకులు ఎస్కలేటర్‌కు ఎడమ వైపున నిశ్చలంగా నిలబడటం ఆచారం, అయితే ప్రయాణికులు ఎక్కేందుకు లేదా దిగేందుకు కుడి వైపున తెరిచి ఉంచుతారు..
ఇక ప్రజలు ఎడమ లేదా కుడి వైపున నిలబడినా, ఎస్కలేటర్ల ను ఉపయోగిస్తున్నప్పుడు కదలకుండా ఆపాలని ఆర్డినెన్స్ పిలుపునిచ్చింది. ఎస్కలేటర్‌ల ను నియంత్రించే రైలు స్టేషన్‌లు, వ్యాపారాలు మరియు ఇతర సంస్థలు తప్పనిసరిగా సందర్శకులకు అవగాహన కల్పించాలి.. ఈ ఆర్డినెన్స్ జపాన్‌లో ఈ రకమైన రెండవది. మొదటిది 2021లో తూర్పు జపాన్‌లోని సైతామా ప్రిఫెక్చర్‌లో వచ్చింది.
రేవంత్ రెడ్డిని సీఎం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలి
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు జంగయ్య యాదవ్(వజ్రేష్ యాదవ్) హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాట్లాడుతూ ఈసారి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ జంగయ్య యాదవ్(వజ్రేష్ యాదవ్) కే వస్తుందని కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. రాబోయే 50 రోజులు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కోరారు.
డైరెక్టర్ అవుతున్న మరో జబర్దస్త్ కమెడియన్?
ఇటీవల, జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి బలగం సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ కూడా డైరెక్టర్ గా మారి ఒక సినిమా డైరెక్ట్ చేశాడు కానీ డి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మరో తెలుగు కమెడియన్ దర్శకుడిగా మారేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన ఇంకెవరో కాదు కమెడియన్ ధనరాజ్. ధనరాజ్ ఒకప్పుడు టాలీవుడ్‌లో చాలా మంచి యంగ్ కామెడియన్. ఇప్పటికే హీరోగా కూడా ఒకటి రెండు సినిమాలు చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా మారేందుకు సిద్ధం అవుతున్నాడు. సముద్రకని ప్రధాన పాత్రలో నటించే తెలుగు సినిమాతో ధనరాజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడని అంటున్నారు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ZEE5 సంస్థ నిర్మించనుందని అంటున్నారు.
ఇద్దరు క్రికెటర్లపై హెచ్సీఏ వేటు.. ఐదేళ్ల నిషేధం
ఇద్దరు క్రికెటర్లపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) నిషేధం వేటు వేసింది. అండర్-19 క్రికెటర్ మహ్మద్ బాబిల్లేల్, రిజిస్టర్డ్ ఆటగాడు శశాంక్ మెహ్రోత్రాలను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీమ్ సెలక్షన్ లో తప్పుడు పత్రాలు(నకిలీ వయస్సు సర్టిఫికెట్స్) ఇచ్చినట్లు హెచ్సీఏ నిర్ధారించింది. మోసపూరితంగా పత్రాలు రూపొందించి, వాటి సాయంతో టీమ్ కు సెలక్ట్ కావాలని భావించారని హెచ్ సీఏ ఆరోపించింది. అంతేకాకుండా ఆ ఇద్దరి క్రికెటర్లపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు.
ఈ అంశంపై హైదరాబాద్ క్రికెట్ సంఘం సీఈవో సునీల్ కాంటే స్పందించారు. తమ విచారణలో సదరు ఆటగాళ్లు దోషులని నిర్ధారణ అయిందని, దాంతో వారిని జట్ల నుంచి తొలగించామని తెలిపారు. ఈ నకిలీ సర్టిఫికెట్లను ఎక్కడ తయారుచేశారో పోలీసులు కనుగొంటారని సునీల్ కాంటే ఆశాభావం వ్యక్తం చేశారు.హెచ్ సీఏ నియమనిబంధనల పట్ల క్రికెట్ క్లబ్బులు, కోచింగ్ అకాడమీలు ఆటగాళ్లకు అవగాహన కల్పించాలని సూచించారు. మెరుగైన క్రికెట్ వ్యవస్థ కోసం తాము కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.
దేశంలో రెండున్నర శాతం ఉన్న తెలంగాణ 30 శాతం అవార్డులు పొందుతోంది
దేశంలో రెండున్నర శాతం ఉన్న తెలంగాణ 30 శాతం అవార్డులు పొందుతుందన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆదర్శగ్రామం ఒక గంగాదేవిపల్లి ఉండేదని, ఇప్పుడు వందల గ్రాములు గంగదేవిపల్లి మాదిరిగా మారాయన్నారు. మనల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించడం లేదని, 40 వేల కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇస్తున్నామన్నారు. దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అరవై ఏళ్ళు ఏమి చేయలేదు… ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి నమ్మించి మోసం చేసేందుకు సంక్రాంతి గంగిరెద్దుల వాళ్ళ మాదిరిగా వస్తున్నారని, ఇప్పుడు పాలకుర్తిలో డాలర్లు దిగుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్..
‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
ప్రియమణి, సంజయ్ సూరి మెయిన్ లీడ్‌గా ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్ రూపొందింది. బివిఎస్ రవి కథ అందించడంతో పాటు క్రియేటర్ గా వ్యవహరించగా ప్రదీప్ మద్దాలి తెరకెక్కించాడు. హేమంత్ మధుకర్ క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించిన ఈ సిరీస్ ని అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రిలీజ్ డేట్‌ను నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఆహాలో ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు యూనిట్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది, ఈ వెబ్ సిరీస్ అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాల గురించి ఉంటుందని తెలుస్తోంది. ఒక వ్యక్తి తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి అన్ని శక్తి పీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం తిరుగుతుందని అంటున్నారు.
ఇరాన్ నుంచి విమానానికి బెదిరింపు.. రాకపోకలను నిలిపివేసిన హాంబర్గ్ ఎయిర్‌పోర్టు!
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయం ఇరాన్ నుంచి వచ్చిన విమానానికి బెదిరింపు రావడంతో సోమవారం అన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ను నిలిపివేసింది. కొన్ని గంటల తర్వాత బెదిరింపుకు ప్రతిస్పందనగా పోలీసు ఆపరేషన్ తర్వాత ఎయిర్‌పోర్టు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది. పోలీసు చర్యల కారణంగా ఎలాంటి టేకాఫ్‌లు లేదా ల్యాండింగ్‌లు జరగడం లేదని విమానాశ్రయం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
కొన్ని గంటల అనంతరం జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ పునఃప్రారంభించబడింది. ఇరాన్ నుంచి వచ్చిన విమానానికి బెదిరింపు నేపథ్యంలో పోలీసు ఆపరేషన్ నిర్వహించినట్లు ఎయిర్‌పోర్టు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈమెయిల్ ద్వారా పంపబడిన దాడి బెదిరింపుతో అధికారులు ఉత్తర జర్మన్ నగరం హాంబర్గ్‌లో 198 మంది ప్రయాణికులతో టెహ్రాన్ నుంచి వచ్చిన విమానాన్ని శోధించారు. బాంబు బెదిరింపు కారణంగా బెర్లిన్‌కు తూర్పుగా ఉన్న జర్మన్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత విమానాన్ని ఎస్కార్ట్ చేసినట్లు జర్మన్ వైమానిక దళం తన X సోషల్ మీడియా ఖాతాలో తెలిపింది.
ఎన్నికల షెడ్యూల్ ఆన్.. ఆరు గంటల్లో ఖమ్మం జిల్లాలో 12 లక్షలు
ఎన్నికల షెడ్యూలు విడుదలైన ఆరు గంటల్లో ఖమ్మం జిల్లాలో 12 లక్షల 50వేల రూపాయలని పోలీసులు పట్టుకున్నారు. వైరా సబ్ డివిజన్ పరిధిలోని మూడు చోట్ల నగదుని పట్టుకోవడం జరిగింది. అటు షెడ్యూల్ విడుదలవుతున్న క్షణంలోని వైరా సమీపంలో ఐదు లక్షల రూపాయల నగదుని తీసుకుని వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా కొనిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు మరో రెండున్నర లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
ఇవే కాకుండా కొద్దిసేపటికి తల్లాడ వద్ద మరో ఐదు లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పరిమితి మించి అనుమతి లేకుండా తీసుకొని వెళుతుండగా ఈ డబ్బులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై అవుతుండగానే ఈ సమాచారం ప్రజలకి అందటం అనేది కూడా తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితులు పోలీసులు నగదును స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
హమాస్‌తో యుద్ధంలో అజేయమైన మొసాద్ ఎలా ఓడిపోయింది?
ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ గురించి చాలా మంది కథలు కథలుగా చెప్పుకుంటారు. వీటిలో కొన్ని కథలు ఆశ్యర్యాన్ని కలిగిస్తే, మరికొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన గూఢచర్యల్లో సంస్థల్లో మొసాద్ కూడా ఒకటి కావడం గమనార్హం. ప్రపంచంలోని అత్యంత పటిష్ట నిఘా వ్యవస్థలో ఒకటైన మొసాద్‌పై ప్రస్తుతం ఎన్నో ఆందోళనలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఎంతో విస్తృతమైన నిఘా వ్యవస్థ ఉన్నా ఇంతటి విధ్వంసాన్ని ఎందుకు ముందే గుర్తించలేదు.. ఒకవేళ గుర్తించినా వాటిని తిప్పికొట్టే సామర్థ్యం ఉన్నా ఎందుకు ఫెయిల్ అయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. డ్రోన్ల ద్వారా ఆకాశం నుంచి నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. అభేద్యంగా కనిపించే సరిహద్దులో ఎల్లప్పుడూ భద్రతా కెమెరాలు, సైనికులు ఉంటారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తమ వనరులు, సైబర్ టెక్నిక్‌లను ఉపయోగించి రహస్య సమాచారాన్ని పొందుతూనే ఉంటాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా హమాస్ తీవ్రవాద సంస్థ జరిపిన దాడి దృష్ట్యా ఇజ్రాయెల్ చేస్తున్న ఈ భద్రతా ఏర్పాట్లన్నీ విఫలమైనట్లు తెలుస్తోంది. వందలాది మంది హమాస్ మిలిటెంట్లు సరిహద్దు దాటి ఇజ్రాయెల్ లోకి ప్రవేశించి వరుస దాడులకు పాల్పడి వందలాది మందిని హతమార్చడంతోపాటు ఈ ప్రాంతంలో వివాదంలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి పై మంత్రి మల్లారెడ్డి సెటైర్లు
మల్కాజిగిరి నియోజకవర్గం లోని ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్స్ లో బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5సంవత్సరాలలో మల్కాజిగిరి ప్రజలు,నాయకులు భయం భయంగా బ్రతికారని , ఇక భయపడాల్సిన అవసరం లేదని పరోక్షంగా మైనంపల్లి పై సెటైర్లు వేసారు. కొరొనా సమయంలో ప్రజలందరి జీవితం అతలకుతం అయినట్లు ఈ 5సంవత్సరాలు మల్కాజిగిరి ప్రజల జీవితాలు అతలకుతం అయిందని మంత్రి మల్లారెడ్డి మైనంపల్లిపై సేటర్లు వేసారు.ఇప్పటివరకు మల్కాజిగిరి నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ మల్కాజిగిరి ఎమ్మెల్యే ఉపయోగించలేదని ఆరోపించారు. మైనంపల్లి ని ఎవ్వరూ మోసం చేయలేదని , భస్మాసురుడిలాగా తనంతట తానే తన రాజకీయ భవిష్యత్తును అంతం చేసుకున్నారని సేటర్లు వేసారు.
కారుపై విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మృతి
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో కారుపై కొండచరియలు విరిగిపడి ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మృతి చెందారు. కైలాష్-మానసరోవర్ మార్గంలో కారు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కొండచరియలు విరిగిపడటంతో రాళ్లు, బండరాళ్లు పడ్డాయి. దాదాపు 24 గంటల తర్వాత సోమవారం శిథిలాల నుండి ఏడుగురి మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. అందులో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పురుషులు, ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు వారు తెలిపారు.
ఈ సంఘటన ఉత్తరాఖండ్ జిల్లాలోని థక్తి ప్రాంతానికి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. మృతులు గుంజి నుండి ధార్చులకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పితోర్‌గఢ్ ADM శివ్ కుమార్ బరన్వాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు అన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు Mr బరన్వాల్ తెలిపారు. SDRF, ITBP, ఆర్మీ పోలీసు సిబ్బంది, స్థానికులు మృతదేహాలను భారీ శిథిలాల నుండి తీయడానికి చాలా కష్టపడ్డారని ఆయన చెప్పారు.