ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పులుల దాడులు కలకలం రేపుతున్నాయి. ఇన్నాళ్లు వరుసబెట్టి పశువులను చంపేశాయి.. తాజాగా కొమురం భీం జిల్లా వాంకిడి మండలం చౌపన్గూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఖానాపూర్ కుచెందిన సిడాం భీము పత్తిచేనులో ఉండగా పులి దాడి చేసి చంపేసింది. దాడి చేయడమే కాకుండా కొంత దూరం లాక్కెళ్లింది.. తీవ్ర రక్తస్రావం కావడంతో భీము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే శివారులో పోడు సర్వే చేస్తున్న అటవీశాఖ అధికారులు సమాచారం చేరడంతో చప్పుళ్లు చేస్తూ స్పాట్…