Fire Accident: హైదరాబాద్ నగరంలో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోడాం, నూతన సచివాలయం, రామాంతపూర్‌లో వరుస ఘటనలు మరువకముందే తాజాగా కూకట్ పల్లిలోని పార్క్ షేడ్స్‌లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం భాగ్యనగర ప్రజలను భయాందోళనకు గురి చేసింది. వరుస ప్రమాదాలతో నగర వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పార్కట్ షెడ్స్‌లో పార్కింగ్ చేసిన ఉన్న మూడు బస్సులో ఈప్రమాదం జరిగింది. ఒకబస్సులు మొదట మంటలు చెలరేగడంతో పక్కనే వున్న మరో బస్సుకు మంటలు అంటుకున్నా అలా మూడు బస్సలు అగ్నికి ఆహుతయ్యాయి.
Read also: Maha Shivaratri Stotram: ఈ స్తోత్రాలు వింటే పునర్జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు
అయితే అక్కడే వున్న స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటిన ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదంలో మూడు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద విషయం తెలిసి కూకట్ పల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా ఆగంతకులి నిప్పు పెట్టారా? లేక బస్సులో ఏదైనా ప్రమాదవసాత్తు మంటలు చలరేగాయా? బస్సులను కావాలనే నిప్పు పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Monday stotram: పితృ, కాలసర్ప దోషం నుండి బయటపడాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి