హర్యానాలోని ఝజ్జర్‌లో రెండు ట్రక్కులు ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకున్నాయి. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో వేగంగా మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతి అయ్యాయి. వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.
ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెంధూఝర్ పట్టణంలోని ఓ మార్కెట్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 వరకు దుకాణాల సముదాయం పూర్తిగా దగ్దమైయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోదాం, నూతన సెక్రటేరియట్ , రామాంతపూర్‌లో వరుస ఘటనలు మరువక ముందే తాజాగా కూకట్ పల్లి లోని పార్క్ షేడ్స్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం భాగ్యనగర వాసులకు భయాందోళనకు గురయ్యారు.
చిత్తూరు కుప్పం రైల్వే ష్టేషన్ లో ఉద్రిక్తత నెలకొంది. హౌరా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో గమనించిన ప్రయాణికులు భయంతో కిందికి దిగి పరుగులు పెట్టారు. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ట్రైన్ కుప్పం రైల్యే ష్టేషన్ రాగానే మంటలు చెలరేగాయి.