పాతబస్తీ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన కుమారుని అరెస్ట్ చేసారు పోలీసులు. ఎంజాయ్ కోసం మిత్రులతో కలిసి బెంజ్ కారు తో బయటకు వచ్చిన ఆధిల్.. శాలిబండ ఉప్పుగూడ ఫ్లై ఓవర్ల మీదుగా రాష్ డ్రైవింగ్ చేసాడు. చిన్న చిన్న రోడ్లలో అత్యంత రాష్ గా డ్రైవింగ్ చేసిన ఆదిల్ హుస్సేనీ ఆలం పరిధిలో బెంజ్ కారు వేగాన్ని మరింత పెంచాడు. అక్కడ కారు అదుపుతప్పి సాలమ్మ ఢీకొట్టాడు. దాంతో సాలమ్మ అక్కడికక్కడే చనిపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించిన ఆదిల్ గ్యాంగ్… కొద్ది దూరం వెళ్లి ఆటో తోపాటు పాదచారులను ఢీకొట్టాడు. దాంతో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత శాలిబండ సమీపంలో బెంజ్ కారును వదిలి ఆధిల్ గ్యాంగ్ పారిపోయారు. అయితే ఈ హిట్ అండ్ రన్ కేసులో ఆధిల్ తో పాటు ఓ యువకుడు, ఇద్దరు యువతులతో పాటు మైనర్ బాలుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.