Rajanna Sircilla: తెలంగాణ రాష్ట్రంలో దొంగల హడావుడి మళ్లీ మొదలైంది. నిన్న మొన్నటి వరకు చెడ్డీ గ్యాంగ్ నగరంలో హల్ చల్ చేయగా.. దీన్ని ఉదాహరణగా చేసుకుని మరొక దొంగల గ్యాంగ్ రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇంటికి టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి దొంగలు వచ్చి దాడి చేస్తారో అని భయంతో జంకుతున్నారు. సెలవు వచ్చాయంటే తాళం వేసి ఇంటి నుంచి వెళ్లాలంటేనే ఆలోచించే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే ఓ దొంగ ఇంట్లో మనషులు ఉండగానే వారిపై దాడి చేసి చైన్ లాక్కెళ్లిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా మారింది.
Read also: COVID 19 Cases Rise: నెల రోజుల్లో 80 శాతం పెరిగిన కరోనా కేసులు.. జాగ్రత్త సుమీ!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్ లో పిల్లి శ్రీలత కుటుంబం నివాసం ఉంటుంది. అయితే ఇవాళ తెల్లవారు జామున ఇంటి ఆవరణలో ఏదో అలికిడి వినిపించడంతో శ్రీలత తలుపు తెరచి తను పెంచుకుంటున్న కుక్కతో సహా బయటకు వచ్చింది. అయితే తన చేతిలో ఉన్న కుక్కను గోడకు కట్టింది. ఇంటి పక్కనే శబ్దం రావడంతో ఆమె తొంగి చూసింది. అయితే శ్రీలతను కనపడకుండా దాక్కుని నిలబడి వున్న దొంగను చూసింది. దీంతో దొంగ ఒక్కసారిగా శ్రీలతపై దాడి చేసాడు. ఆమె ఇంటి లోపలికి పరుగులు పెడుతున్న శ్రీలత మెడను గట్టిగా పట్టుకున్నాడు. శ్రీలత ఇంటి పరదాకున్న కడ్డితో దొంగపై దాడి చేసింది. అయినా అవన్నీ లెక్కచేయని దొంగ శ్రీలత మెల్లోవున్న బంగారు చైన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. అయితే శ్రీలత అరుపులు, పెంపుడు కుక్క అరుస్తున్న ఎవరు బయటకు రాలేదు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. శ్రీలత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ టైమ్ లోనే శ్రీలత ఇంటి బయటకు వస్తుందని దొంగ ఎలా గమనించాడు అనే కోణంలో విచారణ చేపట్టారు.
Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్‌లో మెగా ఆఫర్.. 55 ఇంచెస్ టీవీపై రూ. 50,991 వేల తగ్గింపు! ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ మాత్రం కాదు