బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయి: డి.రాజా

ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ప్రారంభమైన ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలు. ఈ సభలు ఇవాళ్టినుంచి ఈనెల 10 వరకు జరగనున్నాయి. కాగా ఈ కార్యక్రమాలకు సీపీఐజనరల్‌ సెక్రటరీ డి. రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డి. రాజా మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఏ ఐవైఎఫ్ నాకు తల్లి లాంటిదన్నారు. కమ్యూనిస్టు పార్టీ భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడిందన్నారు. కాంగ్రెస్‌తో పాటు ముందుండి పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్రలేని, బ్రిటిషర్లకు మోకరిల్లిన పార్టీ నేడు అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు పార్టీ మాత్రం ప్రజాసమస్యలపై నేటికి వీధుల్లో పోరాడుతూనే ఉందన్నారు.

జవహార్‌లాల్‌ నెహ్రు ప్రభుత్వ రంగసంస్థలు ఆధునిక దేవాలయాలని నెలకొల్పితే వాటిని మోడీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు అమ్ముతూ వారికి కొమ్ముకాస్తుందని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అచ్చేదీన్‌ ఎప్పుడు వస్తాయని ప్రజలు అడుగుతున్నారన్నారు. అంబానీ, అదానీలకు మాత్రమే మంచి రోజులు వచ్చాయి. సామాన్య ప్రజలకు రాలేదని దుయ్యబట్టారు. మోడీ పాలసీలు అన్నీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు.

Read Also: మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందాం: హరీష్‌ రావు

బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది. మోడీ పాలసీలను, మోడీ పాలన తీరును వ్యతిరేకిస్తే జైల్లో పెడుతున్నారు. హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఉద్యమాన్ని చూసి….చేసేది లేక మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారని డి. రాజా అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని దింపేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై పోరాటం ఎలా చేయాలో ఈ సమావేశాల్లో చర్చించాలని డి.రాజా అన్నారు.

Related Articles

Latest Articles