Kamareddy Crime: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కడుపులో పెట్టుకుని కని పెంచి ఓస్థాయికి తెచ్చిన తల్లి తండ్రులపైనే పిడ్డలే కడతేర్చుతున్నారు. గుండెల్లో పెట్టుకుని పెంచిన తల్లిదండ్రులను గుండెపై తల్లి ఊపిరి ఆగిపోయేలాచేస్తున్నారు. వారి కడుపున కొట్టకుని కన్న బిడ్డ ఆకలి నింపే తల్లిదండ్రుపై కడుపుకొడుతూ వారిపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందాన్ని నింపుకుంటున్నారు. కన్నపేగుపై కర్కసత్వాన్ని చూపిస్తూ తల్లి దండ్రులపై అతికిరాతకంగా హింసించి చంపడానికైనా వెనుకాడటం లేదు.
Read also: Bandi sanjay: బ్యాట్ పట్టిన బండి సంజయ్.. యువకులతో ఉత్సాహంగా..
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామంలో నర్సవ్య, కొడుకు నర్సారెడ్డి కుటుంబం నివాసం ఉండేది. నర్సారెడ్డికి కొద్ది నెలల క్రితం పెళ్లి చేసింది నర్సవ్య. కానీ నర్సారెడ్డి భార్య తనని వదిలి వెళ్లిపోయింది. రోజు సైకోలా ప్రవర్తిస్తుండటంతో విసుగు చెందిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే నర్సారెడ్డి, తల్లి నర్సవ్యతోనే ఉంటున్నాడు. కానీ భార్య వదిలి వెళ్లిపోయిన నర్సారెడ్డిలో మార్పు రాలేదు.. వ్యసనాలకు బాలిసై తల్లితో రోజు గొడపడేవాడు. నిన్నటి రోజు పండుగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఫుల్ గా మద్యం సేవించి ఇంటి వచ్చాడు. తల్లితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్యం మాట మటా పెరిగి.. ఆగొడవ కాస్త చిలికి చిలికి గాలివానైంది. తల్లిపై అతికిరాతకంగా విరుచుపడ్డాడు.. తల్లిపై రాడ్డుతో తెగబడ్డాడు. చిత్రహింసలు చేశాడు. అంత జరుగుతున్న స్థానికులు చూస్తు ఉండిపోయారు. కొడుకు సైకో ప్రవర్త వల్ల వాళ్లపై ఎక్కడ వస్తుందో అని భయపడ్డారు. ఆమె అరుస్తూ ఉంటే చూడలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు షాక్ తగిలింది. కొడుకు అనుమాన్పదంగా మృతి చెందగా.. నర్సవ్యకు తీవ్ర రక్తశ్రావ్యం కావడంతో.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Bhogi Celebrations in Telugu States Live: తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు లైవ్