Kishan Reddy: మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నాంపల్లి పార్టీకార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా ప్రగతి భవన్ నుండి వచ్చిందా? మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్‌ఎస్ పెద్ద కుట్ర చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఓటమి కళ్ళ ముందు కన్పించడంతో కొత్త ఆటకు తెర లేపారని ఆరోపించారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించేందుకు వందల కోట్లు వారికి ఇవ్వడం కోసం బీజేపీ కుట్ర, నేరం చేసిందని రాత్రికి రాత్రి ప్రధాని దిష్టిబొమ్మలను మంత్రులు మునుగోడులో తగల బెట్టారని మండిపడ్డారు. డబ్బు, కాంట్రాక్ట్, పదవులు ఆశ పెట్టారని రాత్రికి రాత్రి పెద్ద డ్రామా ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాశ కాలే విపరీత బుద్ది… TRS పార్టీ గురువిండ సామెతల వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటేడ్ అంటూ ఆరోపించారు. మునుగోడు ప్రజలు తమ వైపు లేరని వింత నాటకాలకు, కొత్త డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. దొరికిందని చెబుతున్న డబ్బు ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా ప్రగతి భవన్ నుండి వచ్చిందా బయట పెట్టలేదు ఇప్పటి వరకు అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో పిరయింపులను ప్రోత్సహించి, పెద్ద పీట వేసి మంత్రి పదవులు ఇచ్చింది టీఆర్‌ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబమే అని తెలిపారు.
Read also: AP Forest Department : ఏపీలో ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించాం
అనేక మంది ఎమ్మెల్యేలను రాజీనామ చేయించకుందా పార్టీ లో చేర్చుకుంది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. ఇంద్ర కరణ్ రెడ్డి గెలిచింది ఎక్కడ మంత్రి అయింది ఎక్కడ… బ్రోకరీజం చేసింది ఎవరు? అంటూ మండిపడ్డారు. ఎక్కడైన నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అనేక మంది నీ, బెదిరించి పార్టీ లో చేర్చుకుంది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టడం, రాజకీయంగా బ్లాక్ మైల్ చేయడం, అనేక మందిని బెదిరించి మీరు పార్టీలో చేర్చుకున్నా మీరు. చాలామందికి ఎమ్మెల్సీ, ఎంపీ, ఛైర్మెన్లు, మంత్రి పదవులు చేస్తామని చెప్పి ఇలాంటి ఫిరాయింపులకు పెద్దపీఠ వేసింది సీఎం కేసీఆర్ అని కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్టీలను ముంచిన చరిత్ర ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ నే అంటూ మండిపడ్డారు. వైఎస్ ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకుని ఆపార్టీని ముంచిన చరిత్ర మీది కాదా? అంటూ ప్రశ్నించారు. సీపీఐ పార్టీ ఏకైక ఎమ్మెల్యే వుంటే మీరు చేర్చుకుని శాసనసభలో సీపీఐ పార్టీ గొంతు నరికింది మీరే అని మండిపడ్డారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికం మీద టీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాబోతున్నానని పగటి కలలు కంటున్న ముఖ్యమంత్రి ముద్దుల కుమారుడు మునుగోడులో ఒక బీజేపీ నాయకుడిని ఫోన్ చేసి బీజేపీ ఏముంది టీఆర్‌ఎస్ లో చేరమని అడిగలేదా? అంటూ ప్రశ్నించారు. అదైతే నైతికతనా? అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. అది పోలీసులకు కనిపించలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలిసినా పోలీసులు దాడులు చేయాలేదు. సోషల్ మీడియాలో ఆవార్త ప్రసారం జరిగినా అప్పుడు పోలీసులు ఏం చేశారని నిలదీశారు.
SA vs Ban: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రిలీ రోసో