ఈ సీజన్‌లో చివరి బస్తానూ కేంద్రం కొంటుంది: కిషన్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ తీరు వల్లే రైతులకు కష్టాలు.. వస్తున్నాయని కానీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనదని ఎక్కడ చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో టీర్‌ఎస్ బెంబెలేత్తి పోతుంది.ఈ సీజన్‌లో చివరి బస్తాను కేంద్రం కొంటుందని చెప్పారు. టీర్‌ఎస్ లేని సమస్యలు సృష్టిస్తుంది. ధాన్యం సేకరణ అసలు సమస్యే లేదు. ఉప్పుడు బియ్యం తీసుకోమని చాలా ఏళ్ళ కిందే కేంద్రం స్పష్టం చేసింది. రా రైస్ వచ్చే విధంగా రైస్ మిల్లర్ల తో మాట్లాడారా ? రైతులకు ఆ రకమైన విత్తనాలు ఇచ్చారా ? మేము బియ్యం కొనమని ఎక్కడా లేఖ ఇవ్వలేదు. “పుత్ర వాత్సల్యం” తో రైతులను కేసీఆర్ బలి చేస్తున్నారు. హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన ఫలితం తో తన కొడుకు కేటీఆర్ సీఎం అవ్వలేడని కేసీఆర్ భయపడుతున్నారు. తెలంగాణ ను “విత్తన భాండాగారం” గా చేస్తామన్న కేసీఆర్ కనీసం ప్రత్యామ్నాయ విత్తనాలు కూడా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నేతలు స్వయంగా నకిలీ విత్తనాలు మార్కెట్ చేస్తున్నారు. ప్రభుత్వం సాయం లేక కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
తెలంగాణలో పంటల ప్రణాళిక లేదు. ఓ సారి మక్క వద్దంటారు…ఇంకోసారి సన్న బియ్యం వేసుకోమంటారు…ప్రభుత్వానికి ప్లానింగ్ లేదు. అందుకే బియ్యంకు ధాన్యం సేకరణ కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారు. బీజేపీని ప్రజలలో బద్నాం చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తోంది. కేంద్రం ఇచ్చిన టార్గెట్ ను తెలంగాణ రాష్ట్రం ఇంకా పూర్తి చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని టీఆర్‌ఎస్ నేతలు రీసైక్లింగ్ చేస్తన్నారు. రైతుల పేరు మీద ఎఫ్‌సీఐకి అమ్ముతున్నారన్నారు. మీ కుటుంబ పాలన వైఫల్యాన్ని కేంద్రం పై రుద్దాలని చూస్తున్నారన్నారు. మా విధానంలో ఎలాంటి మార్పు లేదు. మేం కొనబోమని ఎక్కడ చెప్పలేదు.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
మీరు తప్పు చేసి కేంద్రం మీద నెడుతారా మీలాగా గజ్వేల్‌కు ఒక పాలసీ, దుబ్బాకకు ఒక పాలసీ మేం అమలు చేయడం లేదు. దేశమంతటా ఒకే విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి రైతులను ఒప్పించకుండా కేంద్రం పై నెపం వేస్తే ఎలా అని ప్రశ్నించారు. రైతులకు మేలు చేయాల్సింది పోయి కేంద్రం పై ద్వేషపూరిత భావం కలిగేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
- Tags
- bjp
- Farmers
- kcr
- Kishan Reddy
- TRS
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..