మేడారం సమ్మక్క సారలమ్మ పై తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో చిన్నజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వివాదంపై చినజీయర్ స్వామి వివరణ. మహిళల్ని ఆదరించాలని భావించేవాడిని. మహిళల్ని, దేవతల్ని చిన్నచూపుతో మాట్లాడతామని అనుకోవడం పొరపాటు. పూర్వాపరాలు చూడాలి. మధ్యలో ఒకదాన్ని చూపించి విమర్శించడం హాస్యాస్పదం అన్నారు చినజీయర్ స్వామి. ఇవాళ లక్ష్మీ దేవీ పుట్టిన రోజు. ఆగమ గ్రంథాలు ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయ వైదిక…
మేడారంలో భక్తుల సందడి నెలకొంది. ముందస్తు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి వసతి సదుపాయం కల్పించారు. కరోనా వల్ల భక్తులు ముందుగానే వస్తున్నారు. జాతర రాకముందే బెల్లం బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. దర్శనం బాగా అయిందని భక్తులు చెబుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సీజన్ మొదలైంది. ఇంటి ఇలవేల్పులకు మొక్క చెల్లించేందుకు పెద్దఎత్తున భక్తులు జాతరలకు వెళ్తుంటారు. కరోనా పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ జాతరల్లో ముందు జాగ్రత్తల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. జనవరి మాసం వచ్చిందంటే చాలు వరంగల్ జిల్లాలో జాతర సీజన్ మొదలవుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కొత్తకొండ, కొమురవెల్లి, మేడారం జాతరలు జరుగుతాయి. సంక్రాంతి నుంచి మొదలయ్యే జాతరలతో ఉమ్మడి…
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా, తెలంగాణ కంభమేళాగా ప్రసిద్ధి చెందిన వన దేవతల జాతరకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. రెండేళ్లకు ఒక్క సారి వచ్చే ఈ మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు వస్తారు. కోవిడ్ మొదలైన తర్వాత మొదటి సారి జాతర జరుగుతుండటంతో ఈ సారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభు త్వం జాతరకు సంబంధించిన పనులను…
మేడారం మహాజాతర పై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. జాతరకు ఇంకా నాలుగు నెలలే ఉంది. ఇప్పటికి జాతరకు సంబంధించిన పనులను మొదలు పెట్టలేదు. జాతరకు కోటిపై గా భక్తులు హాజరవుతారు. దానికి తగ్గట్టుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గత జాతరలో జరిగిన అపశృతులను దృష్టిలో పెట్టుకుని ఈ సారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు మొదలుపెట్టాల్సి ఉన్న ఇప్పటి వరకు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించటం లేదు. జాతర పనులను పర్యవేక్షించాల్సిన ఏటూరునాగారం ఐటీడీఏకు…