ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. ఈ జాతర కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వ తేదీ వరకు జాతర జరగబోతున్నది. చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యానికి, పగిడిగిద్దరాజు సైన్యానికి మధ్య లక్నవరం వద్ద యుద్దం జరుగుతుంది. ఈ యుద్దంలో పగిడిగిద్దరాజుతో పాటు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు పాల్గొంటారు. ఈ యుద్ధంలో పోరాడి మేడారం సమీపంలోని సంపెంగ వాగు వద్ద వీరమరణం పోందారు.…
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా, తెలంగాణ కంభమేళాగా ప్రసిద్ధి చెందిన వన దేవతల జాతరకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. రెండేళ్లకు ఒక్క సారి వచ్చే ఈ మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు వస్తారు. కోవిడ్ మొదలైన తర్వాత మొదటి సారి జాతర జరుగుతుండటంతో ఈ సారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభు త్వం జాతరకు సంబంధించిన పనులను…
మేడారం మహాజాతర పై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. జాతరకు ఇంకా నాలుగు నెలలే ఉంది. ఇప్పటికి జాతరకు సంబంధించిన పనులను మొదలు పెట్టలేదు. జాతరకు కోటిపై గా భక్తులు హాజరవుతారు. దానికి తగ్గట్టుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గత జాతరలో జరిగిన అపశృతులను దృష్టిలో పెట్టుకుని ఈ సారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు మొదలుపెట్టాల్సి ఉన్న ఇప్పటి వరకు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించటం లేదు. జాతర పనులను పర్యవేక్షించాల్సిన ఏటూరునాగారం ఐటీడీఏకు…