ఆసియాలోనే అతిపెద్ద జాతరగా, తెలంగాణ కంభమేళాగా ప్రసిద్ధి చెందిన వన దేవతల జాతరకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. రెండేళ్లకు ఒక్క సారి వచ్చే ఈ మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు సైతం అమ్మవార్లను దర్శించకునేందుకు వస్తారు. కోవిడ్ మొదలైన తర్వాత మొదటి సారి జాతర జరుగుతుండటంతో ఈ సారి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభు త్వం జాతరకు సంబంధించిన పనులను…