కోవిడ్‌ విజృంభిస్తున్న వేళ.. మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ

మేడారంలో సందడి నెలకొంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం, సంక్రాంతి సెలవులు కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహంచి చీరె, సారె, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, బెల్లం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లోని చెట్ల కింద వంటలు చేసుకుని భోజనాలు చేశారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారని దేవాదాయ అధికారులు తెలిపారు.

Read Also: ఇది ప్రాణాలు తీసే ప్రభుత్వం: రేవంత్‌ రెడ్డి

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మవార్ల జాతర ఉండటం, మరో వైపు ఒమిక్రాన్‌, కరోనా కేసులు పెరుగుతుండంటంతో మళ్లీ లాక్‌ డౌన్‌ పడుతుందేమో అన్న అనుమానాలు భయం నేపథ్యంలో ముందుగానే అమ్మ వార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కరోనా భయంతో చాలా వరకు ముందస్తుగానే అమ్మవార్ల మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వస్తున్నారని, గతంలో కంటే ఈ సారి ముందస్తు మొక్కులు ఎక్కువ అయ్యాయని ఆలయ అధికారి ఒకరు తెలిపారు.

Related Articles

Latest Articles