రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా 317 జీవోను సవరించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని బాబాపూర్‌కు చెందిన సరస్వతి 317 జీవో మూలంగా స్వంత ఊరు నుంచి కామారెడ్డికి ట్రాన్సఫర్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు పార్టీ నాయకులు మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు ఎం ధర్మారావు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు విట్టల్, నిజామాబాద్ జిల్లా…
రాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో నిరసనకు సిద్ధమయ్యారు. నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మేల్కొలిపి ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా ఉన్న 317 జీఓను ఉపసంహరించుకునేలా రేపు రాత్రంతా కరీంనగర్‌లో జాగరణకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని తన కార్యాలయంలో రేపు (జనవరి 2) రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు (జనవరి 3) ఉదయం 5 గంటల…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంపై స్పందించిన మాజీ టీఎస్‌పీఎస్‌సీ మెంబర్, బీజేపీ నేత విఠల్ మాట్లాడుతూ.. మాజీ టీఎస్‌పీఎస్‌సీ మెంబర్ గా చెప్తున్న, 1 లక్ష 32 వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాట అబద్ధం అని ఆయన అన్నారు. ఏడేళ్లలో టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేసింది 32 వేల ఉద్యోగాలేనని, కేసిఆర్ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నడని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు…