TGSRTC : ప్రతి కాలనీ, ప్రతి గ్రామంలోకి RTC కొత్త ప్రోగ్రాం..!
- కాశీ, అయోధ్య యాత్రలకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలు
- యాత్రాదానం ద్వారా పేద, అనాథ విద్యార్థులకి సదుపాయం
- పండుగలు, పెళ్లిళ్లకు అద్దె బస్సులు – ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్
- ప్రతి గడపకు RTC సేవలు – విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ ప్రోగ్రాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రజలకు చేరువయ్యేలా, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. ఇటీవల పర్యాటకులు, భక్తులకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టిన ఆర్టీసీకి మంచి స్పందన లభిస్తోంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే అందించిన ప్యాకేజీలకు విస్తృత స్పందన లభిస్తుండగా, త్వరలో కాశీ, అయోధ్య వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక సదుపాయాలతో బస్సులను సిద్ధం చేయాలని ఆయన అధికారులు ఆదేశించారు. ఈ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ సేవలను గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లేందుకు పలు వినూత్న ఆలోచనలను అమలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే సౌకర్యవంతం, సుఖవంతం అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలనే ఉద్దేశంతో పలు మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా “యాత్రాదానం” అనే వినూత్న కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యతను ప్రదర్శించేందుకు ముందుకొచ్చారు.
యాత్రాదానం కార్యక్రమంలో దాతలు తమ ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని పేద విద్యార్థులు, అనాథలు, నిరాశ్రయ వృద్ధులు, దివ్యాంగులు వంటి వారిని తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు దాతలు ఈ కార్యక్రమానికి ముందుకొస్తుండడం అభినందనీయమని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. డిపో స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో 2023 మేలో టీజీఎస్ఆర్టీసీ “విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో బస్ ఆఫీసర్లు ప్రతి గ్రామం, కాలనీని సందర్శించి ప్రజలతో 15 రోజులకొకసారి సమావేశమవుతున్నారు. ఈ సమావేశాల్లో బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్లు, కొత్త సర్వీసులు, అలాగే సమస్యల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఆ వివరాలను పై అధికారులకు అందజేసి, తక్షణమే చర్యలు తీసుకోవడానికి సహకరిస్తున్నారు.
గ్రామాల్లో పెళ్లిళ్లు, జాతరలు, శుభకార్యాల సమయంలో రద్దీ పెరిగే అవకాశాలను ముందుగానే గుర్తించి, ఆ సందర్భాల్లో అదనపు బస్ ట్రిప్పులు నడపాలని ఆఫీసర్లు అధికారులకు సూచిస్తున్నారు. అంతేకాకుండా, వివాహాలు, శుభకార్యాలకు బస్సులను అద్దెకు ఇవ్వడం, వస్తు రవాణా కోసం కార్గో సేవలను అందించడం ద్వారా ఆర్టీసీ మరింతగా ప్రజలకు చేరువవుతోంది.
ప్రతి గడపకు ఆర్టీసీ సేవలను తీసుకెళ్లాలన్న లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ తన కార్యాచరణను ముందుకు తీసుకెళ్తోంది. పర్యాటక ప్యాకేజీలు, యాత్రాదానం, విలేజ్ బస్ ఆఫీసర్ వంటి పథకాల ద్వారా సంస్థ సామాజిక బాధ్యతతో పాటు సేవా దృక్పథాన్ని మరింత బలపరుస్తోంది. త్వరలో ప్రకటించనున్న కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజీలు రాష్ట్రంలోని భక్తులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.
Meena : ఆ ఫ్లైట్ లో సౌందర్యతో పాటు నేనూ వెళ్లాలి.. మీనా కామెంట్స్
తాజావార్తలు
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!