Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని పామెన గేటు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఒక కారు హఠాత్తుగా అదుపుతప్పి, రోడ్డు డివైడర్‌ను దాటుకుని అవతలి వైపు మార్గంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు, ప్రమాదంలో గాయపడిన వారిని గుర్తించారు.
బాధితులు షాబాద్ మండలం పొత్గల్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గౌడ్, మురళి గౌడ్, ఒగ్గు వెంకటయ్య, కార్ల శివకుమార్‌లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రాజ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా గాయపడి మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read
- Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
- Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం... టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
- Wife Kills Husband : కొత్తపేటలో దారుణం... భార్య చేతిలో భర్త దారుణ హత్య!
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
క్షతగాత్రులను ముందుగా సమీపంలోని మొయినాబాద్ మండల పరిధిలో ఉన్న భాస్కర ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను వారిని హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ బాధితులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే బ్రిడ్జి , పామెన గేటు సమీపంలో ఇలాగే వేగంగా వచ్చిన వాహనాలు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందిన ఘటనలు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న చేవెళ్ల పోలీసులు కారు బోల్తా పడిన తీరుపై, ప్రయాణ వివరాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Xiaomi TV A Pro e Series: 85 ఇంచెస్ వరకు 4K QLED టీవీలు లాంచ్ చేసిన షియోమి.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
-
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
-
Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
-
Toyota Innova Hycross Facelift: 360 డిగ్రీ కెమెరా, Wi-Fi, డ్యాష్‌క్యామ్‌తో ఇన్నోవా హైక్రాస్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!