Making Chicken Pizza : చికెన్ పిజా ఇంట్లోనే చేసుకోండిలా …
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చికెన్ పిజా తయారీకి కావాల్సిన పదార్థాలు.. రా ఓట్స్, చికెన్, బెల్‌పెప్పర్స్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, పెప్పర్, బట్టర్, ఛీజ్, ఆనియన్, ఆలివ్ ఆయిల్.
చికెన్ పిజా తయారీ చూద్దాం. బెల్ పెప్పర్స్, ఆనియన్ మరియు చికెన్ కట్ చేసి పెట్టుకోవాలి. పాన్ వేడి అయ్యాక ఓట్స్ వేయాలి. రా ఓట్స్ పచ్చిగా ఉంటాయి కాబట్టి 5 నిమిషాలు పాన్‌లో వేయించాలి. ఆ టైంలో సాల్ట్, పెప్పర్ వేయాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టాలి. ఓట్స్‌ను మిక్సీ పడితే పౌడర్ అవుతుంది. ఆ పొడి పిండికి కొంచెం నీళ్లు కలిపి స్పూన్‌తో తిప్పి మళ్లీ మిక్సీ పట్టాలి. దీంతో తడి పిండి వస్తుంది. పాన్ పైన బ్రష్‌తో ఆయిల్ పూసి ఈ ఓట్స్ మిశ్రమాన్ని పోయాలి. 1-2 నిమిషాలు అలా ఉంచి మరో వైపుకు తిప్పేసి వేడి చేయాలి. ఇప్పుడు పిజా స్టఫ్ రెడీ చేద్దాం. గిన్నెలో 1 స్పూన్ బటర్ వేయాలి. అది కరిగాక బెల్ పెప్పర్స్ ముక్కలు, తర్వాత చికెన్ ముక్కలు కలపాలి. వాటిని 3-4 నిమిషాలు స్పూన్‌తో తిప్పాలి. సాల్ట్ మరియు పెప్పర్‌ను యాడ్ చేసి చివరలో ఆనియన్ ముక్కలు వేయాలి. పిజా బేస్‌కి ఒక వైపు సాస్ లాగా అప్లై చేయాలి. తర్వాత.. బెల్ పెప్పర్స్, చికెన్, ఆనియన్ ముక్కలను సాస్ మీద వేసుకోవాలి. వెజిటేరియన్లు.. పన్నీర్, మష్రూమ్స్.. ఇలా ఏదైనా వాళ్ల ఛాయిస్‌ను బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. పిజా మీద తక్కువ ఛీజ్ వేసి ఫైనల్‌గా మైక్రో ఓవెన్‌లో 2 నిమిషాలు ఉంచాలి. ఇలా రెడీ అయిన మీడియం సైజ్ చికెన్ పిజాను 6-8 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ వంటకం ద్వారా ప్రొటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ మన బాడీకి లభిస్తాయి. మరెందుకు ఆలస్యం?. నోరూరించే ఈ న్యూట్రిషనల్ రెసిపీని మీరూ ట్రై చేయండి.
Also Read
- Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
- Tags
తాజావార్తలు
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!