తెలంగాణలో చలి తీవ్రత తగ్గుతోంది. రాబోయే రెండురోజుల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమప్రాంతం నుంచి వస్తున్న గాలుల వల్ల శుక్ర, శనివారాల్లో చలి తీవ్ర పెరుగుతుందని చెబుతున్నారు. కనీస ఉష్ణోగ్రతలు 17.5 శాతం నమోదు కావచ్చు.
గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ 14.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) అంచనాల ప్రకారం రాబోయే రెండురోజుల పాటు 12 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చు. తెలంగాణలో వివిధ ప్రాంతాలు, హైదరాబాద్ శివారు ప్రాంతాలైన హయత్ నగర్, సరూర్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఫలక్ నుమా ప్రాంతాల్లో 10 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
నగరంలో మంచు దుప్పటి కప్పుకునే అవకాశం వుంది. మంచుతో పాటు చలిగాలులు గంటకు పదికిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తెలంగాణలోని ఇతర జిల్లాలయిన కుమరం భీం అసిఫాబాద్, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డ ప్రాంతాల్లో 8 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని టీఎస్డీపీఎస్ వెల్లడించింది. చలి తీవ్రత పెరగడంతో జనం స్వెట్టర్లు, చలిమంటలతో సేదతీరుతున్నారు.