Tragedy : అమెరికాలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నివాసులు తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ విషాద వార్తతో మంచిర్యాల పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల రెడ్డి కాలనీలో నివసించే విశ్రాంత సింగరేణి కార్మికుడు పి.విఘ్నేష్ కుటుంబం అమెరికాలో నివసిస్తోంది. విఘ్నేష్ దంపతులకు స్రవంతి, తేజస్వి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు జరిగి, అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల తేజస్వి గృహప్రవేశం సందర్భంగా గత నెల 18న…
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్‌లో విషాదం నెలకొంది. రోజుల వ్యవధిలో ఒకే కుటంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య యత్నంకు పాల్పడగా.. ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడి మృతిని తట్టుకోలేని దంపతులు కూతురుకు పురుగుల మందు తాగించి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనతో రాజీవ్ నగర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాజీవ్ నగర్‌కు చెందిన భార్య-భర్తలు బండి చక్రవర్తి, దివ్యకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. రెండు నెలల క్రితం…
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మంచిర్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. బండి సంజయ్ తోపాటు జెండా ఊపిన రాష్ట్ర మంత్రి జి.వివేక్, ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. వందేభారత్ రైలు ప్రారంభం సందర్భంగా కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. మంచిర్యాలలో నేటి నుండి ‘‘వందే భారత్’’ హాల్టింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. జై బీజేపీ, జై బండి సంజయ్ నినాదాలతో మారుమోగిన మంచిర్యాల రైల్వే స్టేషన్..…
లక్కీ భాస్కర్ మూవీలో హీరో బ్యాంక్ క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. చాలీ చాలని జీతంతో, అప్పులతో జీవితం గడుపుతుంటాడు. బ్యాంక్‌లో ఎంత కష్టపడినా ప్రశంసలు వస్తాయి తప్ప ప్రమోషన్ రాదు. ఈ క్రమంలో హీరో బ్యాంకులోని డబ్బును కాజేసి గూడ్స్ స్మగ్లింగ్ చేస్తాడు. దీంతో అవసరాలకు సరిపడా డబ్బు వస్తుంది. ఇక్కడ కూడా ఎస్బీఐ బ్యాంక్ క్యాషియర్ లక్కీ భాస్కర్ లాగ మారి రూ. 80 లక్షల నగదు, రూ. 2 కోట్లు విలువ చేసే గోల్డ్…
Govt School Teacher Suspended in Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎన్‌పీ వాడ జడ్పీహెచ్‌ఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌కె ప్రసాద్ అనే ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు శనివారం సస్పెండ్ చేశారు. ఈ నెల 24న మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించినందుకు గాను గవర్నమెంట్ స్కూల్ టీచర్‌పై వేటు పడింది. ఈ ఘటనను విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చడంపై సోషల్ మీడియాలో…
తెలంగాణ కేబినెట్ విస్తరణలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌కు ఛాన్స్ దక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు పదిహేను రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయి బంపర్ ఆఫర్ కొట్టేశారాయన. ఆయన పరంగా చూస్తే... అంతా బాగానే ఉంది.
Mancherial: మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఓ దురదృష్టకర ఘటన జరిగింది. జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక లారీ పూర్తిగా నుజ్జునుజ్జయి అయిపోగా, మరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. Read Also:HONOR X9C 5G: డిజైన్‌లో క్లాస్, పెర్ఫార్మెన్స్‌లో దమ్మున్న ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైన హానర్..! ఈ ఘటనకు గురైన లారీలలో ఒకటి ప్రఖ్యాత సబ్బు బ్రాండ్ అయిన…
తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది..
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పరిధిలో గల గాంధీ నగర్ లో చోటు చేసుకుంది. వినయ్ అనే యువకుడు చందన అనే హిజ్రా వెంట పడి వేధిస్తున్నాడని ఆరోపణ వచ్చాయి.. ఆ హిజ్రాను పెళ్లి చేసుకుంటాను లేకపోతే రైలు కింద పడి చనిపోతానంటూ వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వినయ్.
Fake Seeds : నకిలీ విత్తనాల మాఫియా కొత్త పంథాలో అడుగులు వేస్తోంది. పశువుల దాణా పేరుతో నిషేధిత విత్తనాలను సరఫరా చేస్తూ, ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాలకు పార్సిల్ రూపంలో పంపిస్తున్నారు. అధికారులు ఈ నకిలీ విత్తనాల దందాపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మాఫియా కేటుగాళ్లు మాత్రం కొత్త మార్గాలతో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ముఖ్యంగా కుమరంభీం , మంచిర్యాల జిల్లాల్లో నకిలీ విత్తనాల దందా ఊపందుకుంది. ఇటీవల పోలీసులు బస్తాల కొద్దీ…