Checkposts Close: తెలంగాణలోని అన్ని రవాణా శాఖ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 5 గంటలలోపు చెక్‌పోస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రవాణా శాఖ పరిధిలో ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల వద్ద, ప్రధాన మార్గాల్లో పనిచేస్తున్న చెక్‌పోస్టులన్నీ తక్షణమే మూసివేయాలని కమిషనర్ సూచించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని, వారికి తగిన విధులు కేటాయించాలని ఆదేశించారు.
అలాగే చెక్‌పోస్టుల వద్ద ఉన్న బోర్డులు, బ్యారికేడ్లు, ఇతర సూచికలన్నీ తొలగించాలని సంబంధిత డీటీవోలకు ఆదేశాలు జారీ చేశారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని కమిషనర్ సూచించారు. చెక్క్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నీచర్‌ను సంబంధిత జిల్లా రవాణా అధికారి కార్యాలయాలకు తరలించాలని తెలిపారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సక్రమంగా సరిచూసి భద్రపరచాలని సూచించారు.
ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే చెక్‌పోస్టుల మూసివేతపై పూర్తి నివేదికను ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ చెక్‌పోస్టుల వ్యవస్థ పూర్తిగా నిలిపివేయబడనుంది. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఇప్పటికే సంబంధిత జిల్లాలకు సూచనలు పంపారు.
Students Missing Case : గురుకులంలో అదృశ్యమైన విద్యార్థులు సేఫ్