Ponnam Prabhakar : ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చెక్ పోస్టులను రద్దు చేస్తూ జీవో జారీ చేసినట్లు ప్రకటించారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఆన్లైన్‌లో జరగాలనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకుని, ఈరోజు నుండి చెక్ పోస్టులు పూర్తిగా మూసివేస్తూ అమలు చేస్తున్నామని తెలిపారు. రవాణా వ్యవస్థలో ఆధునికత, పారదర్శకతను తీసుకురావడమే…
Checkposts Close: తెలంగాణలోని అన్ని రవాణా శాఖ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 5 గంటలలోపు చెక్‌పోస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రవాణా శాఖ పరిధిలో ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల వద్ద, ప్రధాన మార్గాల్లో పనిచేస్తున్న చెక్‌పోస్టులన్నీ తక్షణమే మూసివేయాలని కమిషనర్ సూచించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని, వారికి తగిన విధులు కేటాయించాలని ఆదేశించారు.…