Checkposts Close: తెలంగాణలోని అన్ని రవాణా శాఖ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 5 గంటలలోపు చెక్‌పోస్టుల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రవాణా శాఖ పరిధిలో ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల వద్ద, ప్రధాన మార్గాల్లో పనిచేస్తున్న చెక్‌పోస్టులన్నీ తక్షణమే మూసివేయాలని కమిషనర్ సూచించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని, వారికి తగిన విధులు కేటాయించాలని ఆదేశించారు.…
నిబంధనలు ఉల్లంఘించిన 250కి పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు బృందాలుగా ఏర్పడి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ వెల్లడించారు. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న వాహనాలు, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ బస్సులపై ఇప్పటి వరకు 250 పైగా కేసులు నమోదు చేశారు.
కీలక శాఖలకు ఆ ఇద్దరు అధికారులు కమిషనర్లు. విభాగాలు వేర్వేరైనా.. ఇద్దరి ప్రవర్తన.. పనితీరు ఒకేలా ఉందట. సొంత శాఖలోని ఉద్యోగులకే అపాయింట్‌మెంట్ ఇవ్వరని టాక్. సీఎం లేదా సీఎస్ నిర్వహించే సమీక్షల్లో మాత్రమే ఆయా శాఖల అధికారులకు కనిపిస్తారట. రెండేళ్ల క్రితం RTA కమిషనర్‌గా వచ్చిన రావు..!ఏదైనా ఉంటే మంత్రి దగ్గరకు వెళ్లాలని రావు చెబుతారట..! MRM రావు. తెలంగాణ రవాణాశాఖ కమిషనర్. నిత్యం ప్రజలతో సంబంధాలున్న ప్రభుత్వ విభాగం. ఉదయం నుంచి సాయంత్రం వరకు…