Students Missing Case : నర్సాపూర్ మైనార్టీ గురుకులంలో నిన్న అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో తండ్రి వద్ద ఉన్నారని తెలిసిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ మైనార్టీ గురుకులంలో చదువుతున్న అన్నదమ్ములు అమీర్ (12), అలీ (11) నిన్న మధ్యాహ్నం ఆటల సమయంలో స్కూల్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు. వారి గురించి వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురుకుల ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు.
Kakinada: 8వ తరగతి బాలికను తోటలోకి తీసుకెళ్లిన టీడీపీ నేత.. కౌన్సిలర్నంటూ బెదిరింపులు..
తదుపరి విచారణలో విద్యార్థులు హైదరాబాద్‌లో తమ తండ్రి వద్ద ఉన్నట్లు సమాచారం అందింది. దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్‌తో కలిసి పోలీసులు హైదరాబాద్‌కు బయలుదేరారు. కుటుంబ కలహాల కారణంగా పిల్లల తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి నర్సాపూర్‌లో ఉంటుండగా, తండ్రి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తండ్రితో ఫోన్‌లో మాట్లాడి అక్కడికే వెళ్లిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లలు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్న అనంతరం వారిని తల్లిదండ్రుల సంరక్షణలోకి అప్పగించే చర్యలు చేపట్టారు.
Pakistan: జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ నయా ప్లాన్.. ఆన్లైన్‌లో ముస్లిం మహిళలకు జీహాదీ క్లాసులు..!